బూమ్... బూమ్... విమానం! | Boom Technologies fastest airplane | Sakshi
Sakshi News home page

బూమ్... బూమ్... విమానం!

Published Sat, Nov 19 2016 2:46 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

బూమ్... బూమ్... విమానం! - Sakshi

బూమ్... బూమ్... విమానం!

వేగం... వేగం...వేగం! కళ్లుమూసి తెరిచేలోగా అన్నీ జరిగిపోవాలని కోరుకునే కాలమిది.

వేగం... వేగం...వేగం! కళ్లుమూసి తెరిచేలోగా అన్నీ జరిగిపోవాలని కోరుకునే కాలమిది. అది ఇంటర్నెట్ కావచ్చు... నడిపే బైక్ కావచ్చు... వెళ్లే ట్రెయిన్ కావచ్చు. మరి విమానాలు మాత్రం ఎందుకు వెనుకబడాలి? అందుకే తాము బూమ్ విమానాన్ని సిద్ధం చేశామంటోంది... అదే పేరుతో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ. అనడమేమిటి... వచ్చే ఏడాదికల్లా తొలి విమానం గాల్లోకి ఎగురుతుందని బల్లగుద్ది మరీ చెబుతోంది  కంపెనీ సీఈవో బ్లేక్ స్కోల్.

అంతా సరేగానీ... ఫొటోలో కనిపిస్తున్న విమానం ఎంత స్పీడ్‌గా వెళుతుంది అంటున్నారా? గంటకు 2335 కిలోమీటర్లు! ఇంకోలా చెప్పాలంటే - ధ్వని వేగానికి 2.2 రెట్లు ఎక్కువ. అర్థం కాలేదా... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లో వెళ్లేంత. ప్రస్తుతం ఈ టైమ్ రెండు గంటల పైమాటే! భలే ఉందే. మరి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే...? న్యూయార్క్ నగరానికై తే ప్రస్తుతమున్న 16 గంటల సమయాన్ని 6 గంటలకు తగ్గించేయవచ్చు.

ఒకసారి ఇంధనం నింపుకుంటే ఈ విమానం 17 వేల కిలోమీటర్ల దూరం వెళ్లగలదీ విమానం. ఇంత వేగంగా వెళ్లగల విమానంలో చార్జీలు ఎలా ఉంటాయో అన్న సందేహం అక్కరలేదు. ఎందుకంటే బూమ్ టెక్నాలజీస్ సంస్థ కొంచెం భిన్నమైన మార్కెటింగ్ ప్లాన్‌తో ముందుకొస్తోంది. ఎక్కువ ట్రిప్స్ నడపడం ద్వారా కొంచెం ఎక్కువ టికెట్ ధరలతోనే లాభాలు పొందవచ్చునన్నది ప్లాన్. పైగా చాలా తేలికగా ఉంటూనే దృఢంగా ఉండే కాంపోజిట్ మెటీరియల్‌ను వాడడం వల్ల ఇంధనం ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. తద్వారా టికెట్ ధరలూ తగ్గించవచ్చునని కంపెనీ ఆలోచిస్తోంది.

ఇంతకీ ఈ విమానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అంటున్నారా? అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది చివరినాటి కల్లా ఈ రకం తొలి విమానం గాలిలోకి ఎగిరే అవకాశముంది. ఆ తరువాత మరో మూడేళ్లకు పూర్తిస్థారుులో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈలోపుగా బూమ్ టెక్నాలజీస్  ఎక్స్‌బీ-1 పేరుతో ఓ బుల్లి సూపర్ స్పీడ్ విమానాన్ని తయారు చేస్తోంది. టెక్నాలజీలు, వైమానిక పరీక్షల లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఈ విమానం అసలు విమానం సైజులో మూడోవంతు మాత్రమే ఉంటుంది. ఇటీవలే దీన్ని అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో ఆవిష్కరించారు. నాసా, స్పేస్ ఎక్స్, బోరుుంగ్ వంటి సంస్థల్లో పనిచేసిన ఇంజినీర్లు ఉన్న బూమ్ టెక్నాలజీస్ సంస్థ విజయవంతమైతే విమానయాన రంగంలో ఇక కొత్త శకం మొదలైనట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement