Joe Biden Is Using Shorter Stairs To Avoid Falls While Boarding Air Force One - Sakshi
Sakshi News home page

Biden Using Shorter Stairs: అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం

Published Wed, Jul 26 2023 8:43 AM | Last Updated on Wed, Jul 26 2023 9:56 AM

biden doubles use of shorter stairs to board air force one - Sakshi

కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో  జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్‌ ఇలా పడిపోవడం ఆయకు పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనిని నివారించేందుకు  ఆయన షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ వినియోగించడం రెండితలయ్యిందని ఒక నివేదిక వెల్లడించింది.

బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు?
దీనిని చూస్తుంటే 80 ఏళ్ల బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు కల్పిస్తున్నట్లున్నదనే విమర్శలు వస్తున్నాయి. బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తడబాటు మరోమారు జరగకుండా  వైట్‌హౌస్‌ అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రవేశించడానికి  షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ మరోమారు ఉపయోగించారు. గత ఏడు వారాల్లో బైడెన్‌ 84 శాతం మేరకు షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ వినియోగించారు. బైడెన్‌ విమానం ఎక్కినప్పుడు, దిగినప్పుడు 37 సార్లు షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ ఉపయోగించారని నివేదిక పేర్కొంది. ఒక విశ్లేషణ ప్రకారం అధ్యక్షుడు బైడెన్‌ ఎయిర్ ఫోర్స్ వన్‌లో మరొకసారి స్లిప్‌ కాకుండా ఉండేందుకు తరచుగా షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ ఉపయోగిస్తున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా..
గత జూన్‌లో జరిగిన వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న బైడెన్‌ బిడెన్ వేదికపై పడిపోయిన అనంతరం ఆయన షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ వినియోగించడం మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో బైడెన్‌ 84 శాతం  మేరకు షార్టర్‌ స్టెయిర్‌కేస్‌ను ఉపయోగించారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ అధికారులు నిరాకరించారు. అయితే బైడెన్‌ సహాయకుడొకరు మాట్లాడుతూ  ఈ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదన్నారు.


హిల్లరీ క్లింటన్ మద్దతు
మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా 2024లో బైడెన్‌ ఎన్నికల్లో పాల్గొనేందుకు అతని వయస్సు ఒక సమస్య అని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అ‍న్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ అతనే సరైనవాడని భావిస్తున్నానని తెలిపారు. బైడెన్‌కు వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా గానీ ముందుకు వెళ్లాలనుకోవడంలేదని, తాను బైడెన్‌ శిబిరానికి చెందిన వ్యక్తినని హిల్లరీ క్లింటన్ అన్నారు. 
ఇది కూడా చదవండి: ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement