staircase
-
ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది?
హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిత్యం వార్తల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది ఈ చిన్న దేశం గురించి, అక్కడి పౌరుల గురించి, అంటే యూదుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆ వివరాలతో పాటు ఇక్కడి జెరూసలేంలో ఉన్న ఒక విచిత్రమైన నిచ్చెన గురించి తెలుసుకుందాం. ఆ నిచ్చెన 273 ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా పక్కకు కదలలేదట. అందుకే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏదేనా వివాదాస్పద స్థలం గురించి చర్చ జరిగినప్పుడు జెరూసలేం పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా చెబుతుండగా, మరోవైపు పాలస్తీనా ఇది తమదేనని వాదిస్తుంటుంది. ఈ నగరం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ స్థలం ఎందుకు అంత ముఖ్యమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం స్థాపితమయ్యాయని చెబుతారు. జెరూసలేం నగరంలో ‘చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్’ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు నమ్ముతారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. క్రైస్తవ మతంలోని ఆరు వర్గాలు సంయుక్తంగా ఈ చర్చిని పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన మెట్లు ఉన్నాయి. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు. ‘ది హోలీ సెపల్చర్ చర్చి’లోని ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం
కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్ ఇలా పడిపోవడం ఆయకు పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనిని నివారించేందుకు ఆయన షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించడం రెండితలయ్యిందని ఒక నివేదిక వెల్లడించింది. బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు? దీనిని చూస్తుంటే 80 ఏళ్ల బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు కల్పిస్తున్నట్లున్నదనే విమర్శలు వస్తున్నాయి. బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తడబాటు మరోమారు జరగకుండా వైట్‌హౌస్ అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బైడెన్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రవేశించడానికి షార్టర్ స్టెయిర్‌కేస్ మరోమారు ఉపయోగించారు. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించారు. బైడెన్ విమానం ఎక్కినప్పుడు, దిగినప్పుడు 37 సార్లు షార్టర్ స్టెయిర్‌కేస్ ఉపయోగించారని నివేదిక పేర్కొంది. ఒక విశ్లేషణ ప్రకారం అధ్యక్షుడు బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో మరొకసారి స్లిప్ కాకుండా ఉండేందుకు తరచుగా షార్టర్ స్టెయిర్‌కేస్ ఉపయోగిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా.. గత జూన్‌లో జరిగిన వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న బైడెన్ బిడెన్ వేదికపై పడిపోయిన అనంతరం ఆయన షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించడం మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్‌కేస్‌ను ఉపయోగించారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ అధికారులు నిరాకరించారు. అయితే బైడెన్ సహాయకుడొకరు మాట్లాడుతూ ఈ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదన్నారు. హిల్లరీ క్లింటన్ మద్దతు మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా 2024లో బైడెన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అతని వయస్సు ఒక సమస్య అని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ అతనే సరైనవాడని భావిస్తున్నానని తెలిపారు. బైడెన్‌కు వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా గానీ ముందుకు వెళ్లాలనుకోవడంలేదని, తాను బైడెన్ శిబిరానికి చెందిన వ్యక్తినని హిల్లరీ క్లింటన్ అన్నారు. ఇది కూడా చదవండి: ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది -
మెట్లెక్కాలంటే ట్రంప్‌కు వణుకే!
లండన్: అందర్నీ హడలెత్తిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మాత్రం మెట్లెక్కడమంటే చాలా భయం.. దీంతో ఆయన విదేశీ పర్యటనల్లో మెట్లెక్కే పరిస్థితులు తలెత్తకుండా అధికారులు తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ బ్రిటన్‌లో పర్యటిం చనున్నారు. బకింగ్‌హామ్ రాజభవనంలో ఎలిజబెత్ రాణి ఇచ్చే విందుకు హాజరు కావడంతో పాటు రాణి స్కాటిష్ విడిది కేంద్రం బాల్మోరల్ రాజభవనాన్నీ సందర్శిస్తారు. అక్కడ మెట్లెక్కడం తప్పనిసరైతే ఏం చేయాలన్న దానిపై అమెరికా అధికారులు తర్జనభర్జన చేస్తున్నారు. ట్రంప్ నడిచే ప్రాంతంలో మెట్లెక్కే పరిస్థితి లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే కింది అంతస్తులోనే వేదిక ఏర్పాటు చేయడంతో పాటు.. ట్రంప్ నడిచే దారిలో మెట్లు అవసరం లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు సండే టైమ్స్ పత్రిక వెల్లడించింది. -
కోటప్పకొండలో పురాతన మెట్ల మార్గం
గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది. కొండ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టిన సందర్భంలో శిథిలావస్థలో ఉన్న మెట్లు బయటపడ్డాయి. తాగునీటి ఎద్దడి నివారణకు కొండ కింద సంపు నిర్మించి కొండపైకి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొండపైకి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పోదలను తొలగిస్తుండగా ఇవి కనిపించాయి. కమ్మజన సంఘం సత్రం వెనుక వైపు నుంచి నేరుగా కొండమీదకు వెళ్ళే విధంగా కొండ రాళ్ళను మెట్లుగా అమర్చారు. వంద ఏళ్ల కింద వాడారు.. సోపాన మార్గంలో మెట్లను అభివృద్ధి చేసిన తరువాత ఈ దారి ఎవరూ వినియోగించక పోవడంతో.. ఈ ప్రాంత మంతా ముళ్ళ పోదలతో నిండిపోయింది. భక్తులు కోటప్పకొండకు చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన మార్గంతో పాటు డిఆర్డిఎ శిక్షణా కేంద్రం వెనుక వైపు నుండి మరో మార్గం ఉండేది. ఈ దారిని ఏనుగుల దారి అంటారు. కొండమీదకు అవసరమైన సామాగ్రిని ఏనుగుల ద్వారా కొండమీదకు తరలించే వారని చెబుతారు. అయితే తరువాత కాలంలో త్రికోటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న నరసరావుపేట జమీందార్లు నూతనంగా సోపాన మార్గం నిర్మించారు. దీంతో ఈ మార్గం గుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలక్రమంలో గతంలో ఉన్న రెండు మెట్ల మార్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బయటపడి న మెట్ల మార్గం పూర్తిగా కొండపైకి లేదు. కొండపైన అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన విస్తరణ పనుల్లో ఈ మార్గం మూతబడిపోయింది. కొండపైన ఇప్పుడు ఉన్న క్యాంటిన్ వెనక కొండరాళ్ళతో నింపి విస్తరించడంతో మెట్ల మార్గం దాని కిందకు వెళ్ళిపోయింది. బయటపడిన మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.