మెట్లెక్కాలంటే ట్రంప్‌కు వణుకే! | Trumphas fear to climbing stairs | Sakshi
Sakshi News home page

మెట్లెక్కాలంటే ట్రంప్‌కు వణుకే!

Published Mon, Apr 24 2017 1:39 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

మెట్లెక్కాలంటే ట్రంప్‌కు వణుకే! - Sakshi

మెట్లెక్కాలంటే ట్రంప్‌కు వణుకే!

లండన్‌: అందర్నీ హడలెత్తిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మాత్రం మెట్లెక్కడమంటే చాలా భయం.. దీంతో ఆయన విదేశీ పర్యటనల్లో మెట్లెక్కే పరిస్థితులు తలెత్తకుండా అధికారులు తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్‌ బ్రిటన్‌లో పర్యటిం చనున్నారు.

బకింగ్‌హామ్‌ రాజభవనంలో ఎలిజబెత్‌ రాణి ఇచ్చే విందుకు హాజరు కావడంతో పాటు రాణి స్కాటిష్‌ విడిది కేంద్రం బాల్‌మోరల్‌ రాజభవనాన్నీ సందర్శిస్తారు. అక్కడ మెట్లెక్కడం తప్పనిసరైతే ఏం చేయాలన్న దానిపై అమెరికా అధికారులు తర్జనభర్జన చేస్తున్నారు. ట్రంప్‌ నడిచే ప్రాంతంలో మెట్లెక్కే పరిస్థితి లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే కింది అంతస్తులోనే వేదిక ఏర్పాటు చేయడంతో పాటు.. ట్రంప్‌ నడిచే దారిలో మెట్లు అవసరం లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు సండే టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement