ల్యాండ్‌ కాని మోదీ హెలికాప్టర్‌; ఫోన్‌లో ప్రసంగం | PM narendramodi's helicopter unable to land in Bahraich due to poor visibility | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ కాని మోదీ హెలికాప్టర్‌; ఫోన్‌లో ప్రసంగం

Published Sun, Dec 11 2016 3:35 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ల్యాండ్‌ కాని మోదీ హెలికాప్టర్‌; ఫోన్‌లో ప్రసంగం - Sakshi

ల్యాండ్‌ కాని మోదీ హెలికాప్టర్‌; ఫోన్‌లో ప్రసంగం

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం వల్ల ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ల్యాండ్‌ కాలేకపోయింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయడానికి అనుకూలించకపోవడంతో ఫైలట్‌ లక్నోకు దారి మళ్లించారు. లక్నోలో సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం బహ్రెయిచ్‌లో పరివర్తన్‌ ర్యాలీలో మోదీ పాల్గొనాల్సివుంది. కాగా ప్రతికూలవాతావరణం కారణంగా ఆయన పర్యటన రద్దయ్యింది. దీంతో మోదీ లక్నో నుంచే ఫోన్‌ ద్వారా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తన మొబైల్‌ ఫోన్‌ను మైకు దగ్గర ఉంచి మోదీ ప్రసంగాన్ని సభికులకు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement