Shoaib Iqbal
-
కాంగ్రెస్‌లో చేరిన షోయబ్ ఇక్బాల్
సాక్షి, న్యూఢిల్లీ: మతియా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికైన షోయబ్‌ఇక్బాల్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో షోయబ్ ఇక్బాల్ తన బంధువులు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె మహ్మద్ ఇక్బాల్, ఖుర్రం ఇక్బాల్‌తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షోయబ్ చేరిక వల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తుందని ఆశి స్తున్నారు. ముస్లింలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రె స్ ఆయనను పార్టీలో చేర్చుకుందని రాజకీయ పరిశీ లకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ముస్లింలేకావడం విశేషం. అయితే లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లు గత లోక్‌సభ ఎన్నిక లలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. ముస్లింల ఓట్లు చీలకుండా ఉండడం కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పోయబ్ ఇక్బాల్ తెలిపారు. లౌకిక పార్టీల మధ్య ఓట్లు చీలడం వల్ల మతతత్వ పార్టీలు విజయం సాధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. షోయబ్ ఇక్బాల్ 1993 నుంచి మతియా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన వేర్వేరు పార్టీల తరపున పోటీచేసి గెలవడం విశేషం.మొట్టమొదట జనతాదళ్, ఆ తరువాత కాంగ్రెస్, ఒకసారి లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన జనతాదళ్ (యునెటైడ్) తరఫున పోటీచేసి గెలిచారు. -
ఆప్‌లోకి షోయబ్?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జనతాదళ్ యునెటైడ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాతియా మహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ విశ్వాస పరీక్ష సమయంలో ఆప్ ప్రభుత్వానికి మద్దతు పలికిన విష యం తెలిసిందే. షోయబ్ ఇక్బాల్ తమ పార్టీలో చేరడం గురించి ఆప్ ఇప్పటిదాకా ఏమీ ప్రకటించనప్పటికీ ఆయన ఆప్‌లో చేరితే అసెం బ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 29కి చేరుతుంది. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని, ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని, ఒకటి రెండు రోజులలో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని షోయబ్ ఇక్బాల్ శుక్ర వారం విలేకరులతో చెప్పారు. దేశంలో మతతత్వశ క్తులను బలహీనపర్చాల్సిన అవసరముం దని ఆయన అభిప్రాయపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని, తాను కూడా ఆ పార్టీలో చేరితే మరింత బాగా పనిచేస్తానన్నారు. పార్టీలో చేరే విషయమై కేజ్రీవాల్‌ను కలిసినట్లు చెప్పారు. -
ఓల్డ్ సిటీపై ఏఏపీ కన్ను
న్యూఢిల్లీ: ముస్లింలు అత్యధికంగా ఉన్న ఓల్డ్ సిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్నేసింది. ఇక్కడ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. స్థానిక ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మేమున్నామంటూ భరోసానిస్తోంది. గతేడాది ఇక్కడ నుంచి భారీ ఓట్లతో గెలిచిన షోయబ్ ఇక్బల్ ఇలాకాలో తమ జెండా రెపరెడలాడేయాలని ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా మటియా మహల్లో షాగంజ్ ప్రాంతంలో ఏఏపీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల భారీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కేజ్రీవాల్ రాసిన లేఖను ఆ పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకు పంపిణీ చేశారు. గత 65 ఏళ్ల నుంచి 65,000లకు పైగా మత ఘర్షణలు జరిగాయని, వీటన్నింటికి బాధ్యులైన బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నాయని అందులో విమర్శించారు. ఉర్ధూ పాఠశాలల దయనీయ స్థితి, శిథిలావస్థలో ఉన్న మదర్సాలు, అవినీతి ఊబిలో చిక్కుకపోయిన వక్ఫ్ బోర్డుతో పాటు జైలు ఊచలు లెక్కపెడుతున్న అమాయక ముస్లింల గురించి వివరించారు. తమ సొంత గడ్డపైనే ముస్లింలు పొరుగింటి ప్రాంతాల వారిగా నివసించాల్సి వస్తోందని తెలిపారు. మైనారిటీవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న కమిషన్ల చురుగ్గా పనిచేయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. అయితే తమను అధికారంలోకి తీసుకొస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ముస్లింల అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. ఉర్దూ భాషకు ప్రత్యేక హోదాను ఇస్తామని, మెరుగైన పౌర సేవలు అందిస్తామని, ఉచిత నీటి సరఫరా చేస్తామని, ఉచిత విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే స్థానికంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు లేకపోవడం ఏఏపీకి కాస్త నిరాశ కలిగించే అంశంగా చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి పార్టీలో మరింత మంది చేరి స్థానికంగా పటిష్టపరుస్తారన్న ఆశతో ఉంది. అయితే ఇక్కడ మంచి నేతగా పేరున్న తక్వి మహమ్మద్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నాయకులు తమ పార్టీలో చేరే అవకాశముందని ఏఏపీ సభ్యుడు ఫిరోజ్ భక్త్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై వారు వివిధ సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు అనేక మంది ఉన్నారని చెప్పారు. ఇటువంటి వారందరూ ప్రత్యామ్నాయంగా ఏఏపీని ఎంచుకునే అవకాశముందని వెల్లడించారు.