జాతీయస్థాయిలో బీసీ పార్టీ
జనతాదళ్(యునెటైడ్) అధ్యక్షుడు శరద్‌యాదవ్
హైదరాబాద్ : ‘‘దేశ జనాభాలో 80 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను 20శాతమున్న అగ్రవర్ణాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎన్నాళ్లని ఊడిగం చేద్దాం మనమే జాతీయ స్థాయిలో ఒక బీసీ పార్టీని ఏర్పాటు చేద్దాం’’ అని జనతాదళ్(యునెటైడ్) అధ్యక్షుడు శరద్‌యాదవ్ ఆదివా రం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సవూవేశంలో వూట్లాడుతూ పిలుపునిచ్చారు. బీసీలంతా సవుష్టిగా ముందుకు సాగితే రానున్న రోజుల్లో కేం ద్రంలో బీసీలదే రాజ్యమన్నారు. టీడీపీ ఎంపీ టి. దేవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘వెనుకబడిన తరగతుల సాధికారత సంస’్థ’ను శరద్‌యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిం చారు. విదేశాల్లో కూడా అట్టడుగువర్గాలు ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటున్నారని చెప్పారు.
అరవై ఏళ్లపాటు పోరాడి తెలంగాణను సాధించుకున్నా ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా ఇక్కడి బీసీలు అభివృద్ధిని సాధిస్తారని అనుకోలేమని శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఎంఎన్ రావు మాట్లాడుతూ దేశంలో 76 శాతమున్న బీసీలకు సరైన కేటాయింపులు జరగడంలేదన్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ 76 శాతంగా ఉన్న బీసీలకు ఎందుకు పూర్తి స్థాయిలో రాజ్యాధికారం అందడంలేదో బీసీలంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తమ సంస్థ ము ఖ్యోద్ధేశ్యాలను వివరించిన ఎంపీ దేవేందర్‌గౌడ్, బీసీ వర్గానికి దీనిని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎంపీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు క్రిష్ణయ్య, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.