పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.
తండా నుంచి ఐఐటీ దాకా...
ఈ ఫొటో చూడండి...
దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.
‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్‌లో చదువుకుంది.
సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్‌మీడియట్‌లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్‌మీడియట్‌లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్‌డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.
‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు.
ఆరోజు ఎంత బాధ పడ్డానో!
‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.
– బదావత్ రాములు, మధులత తండ్రి
చదువే లోకం...
నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా.
– సరోజ, మధులత తల్లి
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల
– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment