madhulatha
-
దారి చూపే దివిటీలు
పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.తండా నుంచి ఐఐటీ దాకా...ఈ ఫొటో చూడండి...దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంది. సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్మీడియట్లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు. ఆరోజు ఎంత బాధ పడ్డానో!‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.– బదావత్ రాములు, మధులత తండ్రిచదువే లోకం...నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా. – సరోజ, మధులత తల్లి – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్ -
చదువుల తల్లికి సీఎం చేయూత
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీ పాట్నా లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థి ని బదావత్ మధులత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. కోర్సు పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని హైదరాబాద్‌కు వెళ్లిన విద్యారి్థనితోపాటు వారి కుటుంబీకులకు సీఎంవో హామీ ఇచి్చంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభచూపి 824వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సోమవారం ‘సాక్షి’లో ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇది సీఎంవో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ విద్యారి్థనిని హైదరాబాద్‌కు పిలిచారు. బుధవారం మధులత ఆమె తండ్రి రాములుతో కలిసి వెళ్లింది. చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. మధులత కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.70 వేలు ఇవ్వడంతో పాటు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
యువకుడి పోరాటం
మనోజ్ కోడూరు, పర్లి భారతి జంటగా నటించిన చిత్రం ‘నీ ఊహల్లో నే ఉంటా’. పురందర్ దాస్.కె స్వీయ దర్శకత్వంలో కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత పురంధర్ దాస్.కె మాట్లాడుతూ –‘‘తన మిత్రులకు జరిగిన అన్యాయంపై ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేసాడన్నది కథాంశం. యాక్షన్‌తో పాటు వినోదానికి పెద్ద పీట వేశాం. పగ నేపథ్యంలో రూపొందిన చక్కని ప్రేమ కథ ఇది. అంతా కొత్త వాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. గోపాల్ పావగాడ, సంధ్య, శ్రావణి, ఆది మామిళ్ల, హిందూనాథ్, మంజునాధ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.కె.ఎం షరీఫ్, సంగీతం: రాజ్ కిరణ్, నిర్మాణ సారధ్యం: మధులత. -
ప్రజాసంకల్పయాత్ర: మేము సైతం అంటున్న చిన్నారులు
-
చిన్నారికి పెద్ద కష్టం
భీమడోలు : ముద్దు ముద్దు మాటలు, అల్లరితో మురిపించాల్సిన చిన్నారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ బిడ్డ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గొంతు వద్ద ఏర్పడిన గడ్డ కేన్సర్‌గా మారడంతో కన్నబిడ్డను బతికించుకునేందుకు రెక్కాడితే గాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు దాతల సహాయాన్ని కోరుతున్నారు. గుండుగొలను గ్రామ శివారు దళిత గ్రామమైన భోగాపురానికి చెందిన పెండెం ఏసుపాదం, రాణిలకు 11 నెలల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పాప జన్మించగా మధులత అని పేరు పెట్టుకున్నారు. ఏసుపాదం వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పుట్టిన సమయంలో పాప గొంతుక కింద చిన్న గడ్డ ఉండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా ఆ గడ్డ పెద్దదైతే శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని చెప్పారు. ఆ పాప పెరుగుతూ ఉన్న కొద్దీ గొంతు కింద వేసిన గడ్డ కూడా పెరుగుతూ వచ్చింది. పాప 9 నెలల వయసుకు వచ్చిన తర్వాత పాలు మింగుడుపడడం లేదు. దీంతో వారు గుండుగొలను పీహెచ్సీ వైద్యాధికారిణికి చూపిం చారు. పిల్లల వైద్యుడిని సంప్రదించాలని సూచించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మధులతను పరీక్షించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. పాపను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసి దానిని కేన్సర్ గడ్డగా నిర్ధారించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు ఉంటే పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తామని చెప్పారు. అప్పటికప్పుడు ఏసుపాదం భీమడోలు తహసీల్దార్ పీబీపీఎల్ పద్మావతిని కలిసి బిడ్డ పరిస్థితిని చెప్పడంతో ఆమె వెంటనే ధ్రువీకరణ పత్రం అందించారు. అనంతరం వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి కేన్సర్ ప్రాథమిక స్థాయిలో ఉందని వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వివిధ వైద్య పరీక్షలు బయటి ల్యాబ్‌లలోనే చేయించుకోవాలని, ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో చేసినా ఇతర ఖర్చులు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని, సిద్ధం చేసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఏసుపాదం దంపతులు తల్లడిల్లుతున్నారు. కూలి పనులు చేసుకుని పేదరికంలో జీవి స్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉండడం, ఆహారం తినలేకపోవడంతో రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పాపను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి వైద్యానికి దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని వేడుకుంటున్నారు. దాతలు 9160484024 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెం 014810100087264కు తమ సహాయాన్ని పంపించవచ్చు.