
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన స్వగ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది. నితీశ్ కుమార్ భక్తియార్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. సీఎం నితీశ్ భక్తియార్‌పూర్‌లోని స్థానిక ఆసుపత్రి కాంప్లెక్స్‌లో రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తుండగా దాడి జరిగింది. నితీశ్‌ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు దాడికి చేయడం గమనార్హం. అనంతరం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.
On-Camera, Nitish Kumar Attacked By Man During Function At Hometown https://t.co/X9oc6FYD3U pic.twitter.com/aX7eOz0oqn
— NDTV (@ndtv) March 27, 2022