
పట్న: బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రవర్తనతో తాను తీవ్రంగా బాధపడ్డాని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ అన్నారు. సోమవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తనను ఉద్దేశించి ‘బ్యూటీఫుల్’ అన్నారని తప్పుపట్టారు. సీఎం ప్రవర్తనకు చాలా బాధపడ్డానని, ఆయన వాడిన అభ్యంతరకర మాటను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె శుక్రవారం మండలిలో తెలిపారు. ఈ విషయాన్ని తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు.
చదవండి: UP Assembly Election 2022: యూపీలో పొత్తు పొడుపులు: దీదీకి ఆహ్వానం.. ప్రియాంకకు మొండిచేయి
ఆ సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని అయితే వారి ప్రత్యామ్నంగా ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకొని ‘బ్యూటిఫుల్’ అని అన్నారు. ప్రభుత్వం మద్యం తయారు చేసే గిరిజన కమ్యూనిటీకి ప్రత్యమ్నయ ఉపాధిమార్గాలు చూపిందని తెలుసుకోవాలన్నట్లు సీఎం సమాధానం ఇచ్చారని అక్కడే ఉన్న కొంతమంది నేతలు తెలిపారు.
అయితే శుక్రవారం శాసన మండలి సమావేశాల చివరి రోజున ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ మండలిలో ప్రస్తావించారు. ఆరోజు సీఎం అభ్యంతరకర ప్రవర్తను బీజేపీ పార్టీ అధిష్టానానికి తెలియజేశానని పేర్కొన్నారు. ఈ ఘటనపై జేడియూ మహిళా నేత స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే పొరబడింది.. సీఎం ఆమెను అవమానపరచలేదు, ఆయన మహిళలపట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటారని గుర్తుచేసింది. మరోవైపు ఈ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ.. సీఎం ప్రవర్తనను తప్పుపడుతూ ఈ వయసులో కూడా అపఖ్యాతి పాలయ్యారని ఎద్దేవా చేశారు.