Janata Dal (United)
-
బీహార్‌లో సీఎం నితీష్‌కు షాక్.. హ్యాండిచ్చిన కుష్వాహా
పాట్నా: బీహార్ రాజకీయం హీటెక్కింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. సీఎం నితీష్‌తో విబేధాల కారణంగా జనతాదళ్(యునైటెడ్)కి ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్పర్సన్ ఉపేంద్ర కుష్వాహా వీడ్కోలు చెప్పారు. జేడీయూకు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇదే సమయంలో బీహార్ సీఎంపై సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఈ సందర్బంగా ఉపేంద్ర కుష్వాహా మీడియాతో మాట్లాడుతూ..‘మేము కొత్త పార్టీ.. రాష్ట్రీయ లోక్ జనతా దళ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. కొత్త పార్టీకి నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటాను. కర్పూరి ఠాకూర వారసత్వాన్ని తమ పార్టీ ముందుకు తీసుకువెళుతుందని తెలిపారు. సీఎం నితీష్ కుమార్ వైఖరి పట్ల కొద్ది మంది మినహా.. జేడీయూలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో బీహార్ కోసం నితీష్ కుమార్ మంచి చేశారు. కానీ.. ఇప్పుడు అతడి నిర్ణయాలు బీహార్ ప్రజలకు అనుకూలంగా లేవు. సీఎం నితీష్ తన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు(పరోక్షంగా తేజస్వీ యాదవ్‌పై విమర్శలు) అని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిని తయారు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఈ కారణంగానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా పాట్నాలో సమావేశాలు, చర్చలు జరిగాయి. మాకు మద్దతుగా ఉన్న నేతలు కూడా ఏకగ్రీవంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే కొత్త పార్టీతో ముందుకు సాగుతాము. ఇదే క్రమంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కుష్వాహా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అంతుకు ముందు 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్‌కు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ఇటీవల నితీశ్ చేసిన ప్రకటన కూడా ఉపేంద్ర అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కుష్వాహా పలుసార్లు తమ కూటమిలోకి రావడం, వెళ్లడం పట్ల నితీశ్‌కుమార్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన జేడీయూని వీడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కుష్వాహా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
బీజేపీని ఓడిద్దాం రండి
పట్నా: కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్‌కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు. రేపటి నుంచి నితీశ్ ఢిల్లీ పర్యటన! 2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్‌కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. మణిపూర్‌లో జేడీ(యూ)కు షాక్ బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ పట్నా/ఇంఫాల్: జేడీ(యూ)కు మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్‌సింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది. ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్ తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్ బీరేన్ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. -
‘నితీశ్ కుమార్ ఈ జన్మలో ప్రధాని కాలేడు!’
పాట్నా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. పాత మిత్రపక్షాలతో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దల్ యునైటెడ్‌కు(జేడీయూ) మామూలు ఝలక్‌లు తగలడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే ఈమధ్యే బీజేపీలో చేరిపోగా.. తాజాగా ఊహించని రీతిలో మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూ.. పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో జేడీయూపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని కావాలని నితీశ్ కుమార్ కంటున్న కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆర్జేడీతో జేడీయూ సర్వనాశనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లు ఇప్పుడు జేడీయూ నుంచి విముక్తి పొందాయి. త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉన్న జేడీయూను చీల్చడం ఖాయం. అప్పుడు జేడీయూ ముక్త బీహార్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీశ్ భావిస్తున్నట్లు ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం ఈ జన్మలో నెరవేరదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుశీల్ మోదీ. ఇక డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారన్న జేడీయూ చీఫ్ ఆరోపణలను సుశీల్ మోదీ ఖండించారు. రంజన్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. డబ్బుకు లొంగిపోయేంత బలహీనులా వాళ్ల ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్లకా జేడీయూ టికెట్లు ఇచ్చింది? అని సెటైర్లు వేశారాయన. వాళ్లు మొదటి నుంచి ఎన్డీయేలో కొనసాగాలనుకుంటున్నారు. జేడీయూ ఇప్పుడేమో ఎన్డీయేకు దూరం జరిగింది. కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన వాళ్లకు నచ్చలేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అని సుశీల్ మోదీ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: అదే జరిగితే 2024లో సీన్ వేరేలా ఉంటుంది -
నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ
పట్నా: ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని బీజేపీ ఆరోపించింది. ఆర్జేడీతో తాజాగా పొత్తు పెట్టుకోవడం ద్వారా బిహార్‌ను అశాంతి, అవినీతి అగాథంలోకి నితీశ్ నెట్టివేస్తున్నారని విమర్శించింది. వేగంగా మారిన సమీకరణాల నేపథ్యంలో మంగళవారం పట్నాలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. నితీశ్ నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లాల్లో మహాధర్నాలు చేపడతామని, బుధవారం బ్లాక్ స్థాయిలో నిరసనలకు దిగుతామని అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. నితీశ్‌కు తెలియకుండానే ఆర్సీపీ సింగ్‌కు కేంద్రం కేబినెట్లోకి తీసుకుందంటూ నితీశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. 2024లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కనౌజ్: బిహార్‌లో బీజేపీతో బంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించిన నితీశ్ కుమార్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభినందించారు. ‘నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జరగబోయే మంచికి ఇది శుభసూచకం’ అని అఖిలేశ్ అన్నారు. ‘ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు ఆగస్ట్ 9న క్విట్ ఇండియా నినాదం వినిపించారు. అదే తేదీన నితీశ్ బీజేపీ భాగో( బీజేపీ నుంచి దూరంగా వెళ్దాం) అంటూ నినదించారు. బిహార్‌లో మాదిరే మిగతా రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి’ అని అన్నారు. చదవండి: (Nitish Kumar: తొలుత ఇంజనీర్‌గా..) -
మరో ఉద్దవ్ థాక్రే కావడం ఇష్టం లేకనే!
పాట్నా: సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ బంధం ఎట్టకేలకు తెగిపోతోందన్న కథనాలు.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగడం ఇక ఎంతమాత్రం మంచిది కాదనే అభిప్రాయంలోకి జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ వచ్చినట్లు భోగట్టా. ఈ మేరకు జేడీయూ వర్గాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు బాగా దగ్గరి వ్యక్తులే మీడియాకు ‘బ్రేకప్’ సమాచారం అందిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ మరో మహారాష్ట్ర శివసేనలా మారబోతోందనే ఉద్దేశం నితీశ్ కుమార్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రభుత్వానికి ఢోకా లేకుండా.. తిరిగి ప్రాంతీయ పార్టీలతో జత కట్టాలనే ఆలోచనకు ఆయన వచ్చారు. ఈ మేరకు ఆర్జేడీ, కాంగ్రెస్ కీలక నేతలకు పాట్నాకు రావాలనే పిలుపు ఈపాటికే అందింది. బీజేపీతో గనుక దూరం జరగకపోతే.. మహారాష్ట్రలో ఉద్దేవ్ థాక్రేకు ఎదురైన అనుభవమే తనకూ ఎదురవుతుందని.. అందుకు ‘వెన్నుపోటు’ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించబోతోందని నితీశ్ కుమార్ భావిస్తున్నారు. అవును.. ఇది నితీశ్ మానసిక అపవ్యవస్థ ఎంతమాత్రం కాదని జేడీయూ వర్గాలు అంటున్నాయి. ‘ప్రాంతీయ పార్టీల మనుముందు మనుగడ కష్టతరం’.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్లు ఇవి. స్థానిక పార్టీలను బీజేపీతోనే భర్తీ చేయించాలన్న ఉద్దేశంతోనే నడ్డా ఆ కామెంట్లు చేశారని భావిస్తోంది జేడీయూ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, సంక్షోభ దిశ అడుగులను జేడీయూ ఆసక్తిగా గమనిస్తోంది. శివ సేనలాగే.. జేడీయూ కూడా ప్రాంతీయ పార్టీనే. పైగా సుదీర్ఘ బంధం ఉంది బీజేపీతో. ఈ కారణంతోనే పొత్తు విషయంలో నితీశ్ ఆలోచనలో పడినట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రకు కొనసాగింపుగా బీహార్ రాజకీయ సంక్షోభం రాబోతుందని జేడీయూలో చర్చ నడుస్తోంది. సుదీర్ఘంగా సాగిన బంధాన్ని సైతం తెంచుకుని.. మహాలో ఉద్దవ్‌థాక్రేను గద్దె దించింది బీజేపీ. అయితే.. అక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి కూటమి వేరని భావించినప్పటికీ.. హు ఈజ్ నెక్స్ట్ క్రమంలో తన పేరు తర్వాత ఉందనే స్థితికి నితీశ్ వచ్చేశారు. ‘వచ్చే ఎన్నికల్లోనూ బీహార్ ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్.. 2024 లోకసభ ఎన్నికలతో పాటు 2025 బీహార్ ఎన్నికల్లోనూ జేడీయూతో పొత్తు ఉంటుంది’.. స్వయానా బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రకటనను నితీశ్ నమ్మట్లేదన్నది ఆయన అంతరంగికులు చెప్తున్నమాట. అంతేకాదు ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనలో బీజేపీ ముసలం రేపిందని, ఆ అసంతృప్తత ద్వారానే ఉద్దవ్‌ను గద్దె దింపిందని నితీశ్ పదే పదే పార్టీ భేటీల్లో చర్చిస్తున్నారట. ఈ క్రమంలోనే.. శివ సేన లాగా బంధం ఉన్న జేడీయూకు రేపో మాపో అలాంటి గతి పట్టొచ్చనే భావిస్తున్నారు ఆయన. అమిత్ షా, బీజేపీ హామీలను, ప్రకటనలను.. ఎట్టిపరిస్థితుల్లో నమ్మే స్థితిలో ఇప్పుడు జేడీయూ, ఆ పార్టీ అధినేత నితీశ్ లేరు. ఎందుకంటే.. వెన్నుపోటు రాజకీయం ద్వారా తనను గద్దె దించే అవకాశం ఉందన్న స్థితికి ఆయన ఎప్పుడో చేరిపోయారు. అందుకు కారణాలు లేకపోలేదు.. బీహార్ కేబినెట్లోని జేడీయూ మంత్రుల్లో చాలామంది అమిత్ షాకు అనుకూలంగా ఉన్నారు. అంతెందుకు.. జేడీయూలో పరోక్షంగా అమిత్ షా డామినేషన్ కొనసాగుతోంది కూడా. జేడీయూ రిమోట్ కంట్రోల్ పూర్తిగా షా చేతికి వెళ్లకముందే జాగ్రత్త పడాలని నితీశ్ అనుకుంటున్నారట. అందుకే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ రాజ్యసభ పదవీకాలాన్ని కావాలనే.. పొడగించకుండా నితీశ్ అడ్డుకున్నారన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఏడు జన్మలెత్తినా నితీశ్ ప్రధాని కాలేడంటూ ఆర్సీపీ సింగ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే జేడీయూకి గుడ్‌బై చెప్పడంతో.. నితీశ్‌కు వ్యతిరేకంగా వెన్నుపోటు వాదన నిజమేమోనని జేడీయూలో చర్చ నడుస్తోంది. ఆర్సీపీ సింగ్‌ను పెద్దల సభకు ఎంపిక చేసిందే నితీశ్. అలాంటిది ఆయనే స్వయంగా ఆర్సీపీ సింగ్‌ను నిలువరించడం గమనార్హం. నితీశ్ కుమార్ ప్రధాన అనుచరుడు, జేడీయూ ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్‌సింగ్(లలన్ సింగ్) ఏం చెప్తున్నారంటే.. బీజేపీలో చేరాలని ఆర్సీపీ సింగ్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. పొత్తులో భాగంగా మేం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఓ కేంద్ర మంత్రి పదవికావాలని కోరాం. ఆ సమయంలో సింగ్ జోక్యం చేసుకుని.. తనకు మాత్రమే మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ‘అలాంటిప్పుడు నాకెందుకు చెప్పడం.. వాళ్లతో కలిసి మీకు మీరే డిసైడ్ చేస్కోండి’ అంటూ నితీశ్, ఆర్సీపీ సింగ్ మీద ఫైర్ అయినట్లు లాలన్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: ఎన్డీఏకు నితీశ్ రాంరాం.. కూలిపోనున్న బిహార్ సర్కార్.. షాక్‌లో బీజేపీ! -
బీజేపీకి ఆ సీఎం దూరం దూరం!
పాట్నా: బీహార్‌లో ఎన్డీయే కూటమికి బీటలు వారుతోందా?. జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను బీజేపీ పదే పదే అవమానిస్తోందా?. వరుసగా ఒకదాని వెనుక ఒకటి జరుగుతుండడంతో ఆయన కలత చెందుతున్నారా?.. బీజేపీకి కావాలనే దూరం పెడుతున్నారా? ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? ఎన్డీయే కూటమి నితీశ్ గుడ్ బై చెప్పే టైం దగ్గర పడిందా?.. గత పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే సంకేతాలు అందిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పదేపదే బీజేపీ చేతిలో అవమానానికి గురవుతున్నారు. బీజేపీ తీరు పట్ల తన అసంతృప్తిని, అసహనాన్ని ఆయన బలంగానే కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి చేరవేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా.. ఎన్డీయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ఆయన వెళ్లడం లేదు. ఓ సంక్షేమ పథకానికి సంబంధించి భేటీ ఉన్న కారణంగా వెళ్లడం లేదంటూ సీఎంవో ద్వారా కేంద్రానికి బదులు పంపించారు ఆయన. వారంలో మూడోసారి.. బీజేపీ పార్టీ, స్వయంగా ఆ పార్టీ పెద్దలు ఆహ్వానం పంపుతున్నప్పటికీ.. సీఎం నితీశ్ కుమార్ ఆయా కార్యక్రమాలను ఎగ్గొడుతూ వస్తున్నారు. జులై 17వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల భేటీ-జాతీయ జెండా చర్చ కోసం సీఎం నితీశ్ కుమార్ వెళ్లలేదు. బదులుగా బీజేపీ నేత తర్కిషోర్ ప్రసాద్ హాజరయ్యాడు. ఆపై నిన్నగాక మొన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు సైతం గైర్హాజరు అయ్యారు. బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్సీల ప్రమాణ కార్యక్రమం ఉందంటూ వెళ్లలేదు. అయితే ఆ కార్యక్రమం సాయంత్రం 4గం. లోపే ముగిసింది. అవమానాలు భరించలేకే? బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం కార్యక్రమం నితీశ్ అవమాన భారం మరింత పెరగడానికి కారణమైంది. ఒకవైపు బీజేపీ నేతలు.. నితీశ్ సర్కారుపైనే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తీరు.. పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో.. బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. స్పీకర్ విజయ్ కుమార్.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని ఒప్పించారు. అయితే.. విజయ్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. శతాబ్ది ఉత్సవాల్లో నితీశ్ పేరు ప్రస్తావన లేకుండా ప్రసంగం చేశారాయన. వీటికి తోడు శతాబ్ది ఉత్సవాల స్మారక చిహ్నంపై కూడా ఐదుసార్లు సీఎం అయిన నితీశ్ కుమార్ ఫొటో పబ్లిష్ చేయలేదు. దీంతో నితీశ్‌కు బీజేపీ చేస్తున్న వరుస అవమానాలపై జేడీయూలో సీరియస్‌గా చర్చ మొదలైంది. ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్న స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా వీటికి తోడు జేడీయూ సర్కార్‌పై బీజేపీ నేతల బహిరంగ విమర్శలు, ముఖ్యంగా స్పీకర్ విజయ్ కుమార్‌ను తొలగించాలన్న నితీశ్ కుమార్ డిమాండ్‌ను బీజేపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడం, అధికారిక కార్యక్రమాలను తన అనుమతి లేకుండా బీజేపీ వాళ్లు నిర్వహించుకోవడంపై ఆయన మరింతగా రగిలిపోతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతల వ్యాఖ్యలపై నితీశ్‌కుమార్ కౌంటర్లు ఇస్తుండడం, పైగా అగ్నిపథ్ నిరసనలను అదుపు చేయడంలో నితీశ్ సర్కార్ ఘోరంగా విఫలం కావడం.. సొంత నేతలతోనే నితీశ్ ఆ పథకంపై విమర్శలు చేయిస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపిస్తోంది బీజేపీ. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఎన్డీయూ కూటమి నుంచి త్వరలోనే జేడీయూ బయటకు వచ్చేయొచ్చన్న చర్చ జోరందుకుంది. ఇదీ చదవండి: స్మృతి ఇరానీ కూతురిపై ఆరోపణలు.. లీగల్ నోటీసులు -
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
నన్ను బ్యూటీఫుల్ అన్నారు.. నేను హర్టయ్యా!
పట్న: బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రవర్తనతో తాను తీవ్రంగా బాధపడ్డాని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ అన్నారు. సోమవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తనను ఉద్దేశించి ‘బ్యూటీఫుల్’ అన్నారని తప్పుపట్టారు. సీఎం ప్రవర్తనకు చాలా బాధపడ్డానని, ఆయన వాడిన అభ్యంతరకర మాటను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె శుక్రవారం మండలిలో తెలిపారు. ఈ విషయాన్ని తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. చదవండి: UP Assembly Election 2022: యూపీలో పొత్తు పొడుపులు: దీదీకి ఆహ్వానం.. ప్రియాంకకు మొండిచేయి ఆ సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని అయితే వారి ప్రత్యామ్నంగా ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకొని ‘బ్యూటిఫుల్’ అని అన్నారు. ప్రభుత్వం మద్యం తయారు చేసే గిరిజన కమ్యూనిటీకి ప్రత్యమ్నయ ఉపాధిమార్గాలు చూపిందని తెలుసుకోవాలన్నట్లు సీఎం సమాధానం ఇచ్చారని అక్కడే ఉన్న కొంతమంది నేతలు తెలిపారు. అయితే శుక్రవారం శాసన మండలి సమావేశాల చివరి రోజున ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ మండలిలో ప్రస్తావించారు. ఆరోజు సీఎం అభ్యంతరకర ప్రవర్తను బీజేపీ పార్టీ అధిష్టానానికి తెలియజేశానని పేర్కొన్నారు. ఈ ఘటనపై జేడియూ మహిళా నేత స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే పొరబడింది.. సీఎం ఆమెను అవమానపరచలేదు, ఆయన మహిళలపట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటారని గుర్తుచేసింది. మరోవైపు ఈ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ.. సీఎం ప్రవర్తనను తప్పుపడుతూ ఈ వయసులో కూడా అపఖ్యాతి పాలయ్యారని ఎద్దేవా చేశారు. -
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి. 2005 నవంబర్ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్ బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్‌భవన్‌లో నితీశ్‌తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్‌తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్ఏఎం నుంచి మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్(ఎంఎల్సీ), వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్ ముకేశ్ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. 2000లో తొలిసారి నితీశ్‌కుమార్ బిహార్ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్‌కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్‌జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌కుమార్ బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్‌కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. -
కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ
న్యూఢిల్లీ: సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే కేంద్ర కేబినెట్లో చేరేందుకు సిద్ధమేనని జనతాదళ్(యునైటెడ్) బుధవారం సంకేతాలిచ్చింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని జేడీయూ నిరాకరించిన విషయం తెలిసిందే. జేడీయూకి కేంద్రంలో ఒకే మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించడంతో ప్రభుత్వంలో చేరేందుకు నాడు జేడీయూ నిరాకరించింది. తాజాగా, బుధవారం జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పార్టీ మరో మూడేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ తరువాత నితీశ్ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ సిద్ధంగానే ఉందని, అయితే, తమకు మంత్రిమండలిలో సరైన ప్రాతినిధ్యం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కానీ ఈ విషయంలో చొరవ తీసుకుంటే తాము స్వాగతిస్తామన్నారు. ఈ విషయంలో తామేమీ షరతులు విధించబోమన్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటులో విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో.. తాజాగా జేడీయూ ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను నితీశ్ ఓడించారు. -
సోషలిస్టు దారిలో నితీష్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) : నితిష్ కుమార్.. పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్.. అవును ఈ డైలాగ్ బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌కు సరిగ్గా సరిపోతుంది. దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉన్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బీహార్‌కు ఓ రాథోడ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయనాయకుడు నితిష్‌కుమార్. రాజకీయ జీవితం నితిష్‌పై జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్మనోహర్ లోహియా పార్టీ సంజీవాది యువజన్ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్నాత్ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్ దల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎన్నికయ్యారు. 1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్ యునైటెడ్ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితిష్ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత జీవితం మార్చి 1, 1951లో బీహార్‌లోని భక్తియార్‌పూర్‌లో కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్, పరమేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. తండ్రి కబిరాజ్ రామ్ లక్ష్మణ్ సింగ్ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ ఆయుర్వేదనిపుణులు. నితిష్‌ను అందరూ ముద్దుగా మున్నా అని పిలిచేవారు. భక్తియార్‌పూర్‌లోని గణేష్ హైస్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నారు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. నితిష్ పాట్నాలోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్ తన భార్యను కోల్పోయారు. జీవనశైలి నితిష్ కుమార్ ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉంటారు. అలాగని తన కోరికలను చంపుకోరు. ఓ సారి బేటియాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో పిజ్జా ఆర్డర్ చేసుకుని మరీ తిన్నారు. తన రోజును యోగాతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే మొలకలు తినటం ఆయనకు అలవాటు. ఆహారంలో కూడా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ‘ఆలూ బూజియా’ ఇష్టంగా తినే ఆహారం. మధ్యాహ్నం వేళల్లో చపాతీ, పరాతాలు తీసుకుంటారు. నితిష్ రూటే సఫరేటు నితిష్ కుమార్ మొత్తం పన్నేండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఆయన సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఆడపిల్లలను బడికి రప్పించడానికి సైకిళ్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆడపిల్లలు చదువుకోవటం పెరిగింది. అంతేకాదు బీహార్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం ఆయనే ప్రవేశపెట్టాడు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని తెలిసినా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి శభాష్ అనిపించుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నపుడే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. తత్కాల్ టికెట్ల రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇక నేరాల అడ్డాగా ఉన్న బీహార్‌లో నేరాలు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నాడు. తప్పు చేసింది ఎవరైనా శిక్షపడేవరకు వదిలిపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో తన పార్టీ నాయకులను సైతం జైలుకు పంపించారు. ఇక మొత్తం 85వేల మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాడు. దీంతో నేరాలు చాలా వరకు తగ్గాయి. - బండారు వెంకటేశ్వర్లు -
శరద్ యాదవ్‌కు బిగ్ షాక్.. నితీశ్ ఫుల్ హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శుభవార్త అందించింది. ఆయన నేతృత్వంలోని జనతా దళ్ (యూనైటెడ్) పార్టీని నిజమైన వర్గంగా గుర్తిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ బాణం గుర్తును కూడా నితీశ్ వర్గానికే కేటాయిస్తున్నట్లు తెలిపింది. ‘‘మెజార్టీ సభ్యుల మద్ధతు నితీశ్‌కే ఉంది. నేషనల్ పార్టీ కౌన్సిల్ కూడా ఆయన వెంటే ఉంది. అలాంటప్పుడు జేడీయూ పార్టీపై శరద్ యాదవ్‌కు ఎలాంటి హక్కు ఉండవు’’ అని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో శరద్ యాదవ్ వర్గం ఢీలా పడిపోయింది. కాగా, మహాకూటమి నుంచి ఈ యేడాది జూలై 26న నితీశ్ వైదొలిగిన తర్వాత.. ఆ నిర్ణయంపై శరద్ యాదవ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా.. శరద్ యాదవ్‌ను రాజ్యసభ ప్రాతినిథ్యం నుంచి తప్పిస్తూ నితీశ్ మరో కవ్వింపు చర్య చేపట్టారు. దీంతో అసలైన పార్టీ తమదేనంటూ శరద్ తరపున ఆ వర్గ నేత చోటుభాయ్ అమరసంగ వాసవ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
'సిగ్గుంటే రాజీనామా చెయ్'
పట్నా: బిహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) లో అంతర్గత కలహాలతో పరిస్థితి నానాటికీ ముదురుతోంది. రాజ్యసభ అధికార ప్రతినిధి పదవి నుంచి శరద్ యాదవ్‌ను తొలగించిన మరుసటి రోజే ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత అజయ్ అలోక్. ఏ మాత్రం సిగ్గు ఉన్నా రాజ్యసభ పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 'అధినేత నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు.. పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి కూడా వదులుకోవాలి కదా?' అని అలోక్, శరద్‌ను ప్రశ్నించారు. శరద్ గౌరవం పక్కనపెట్టి మరీ ఇంకా ఎంపీ పదవినే పట్టుకుని వెలాడుతున్నాడని, ఏ మాత్రం రోషం మిగిలి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అవినీతిమయం అయినందునే మహాకూటమి నుంచి తాము బయటకు రావాల్సి వచ్చిందని అలోశ్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే శరద్‌ను తామేం తొలగించలేదని, ఆయన స్థానాన్ని ఆర్సీపీ సింగ్‌తో భర్తీ మాత్రమే చేశామని బిహార్ జేడీ(యూ) అధ్యక్షుడు నారాయణ్ సింగ్ తెలిపారు. మరో సీనియర్ నేత త్యాగి పార్టీలో చీలిక రాబోదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకోపక్క తన తొలగింపు విషయంపై యాదవ్ పెద్దగా స్పందించకపోవటంతో త్వరలోనే ఈ ముసలం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అయితే 19న జరిగే పార్టీ సర్వసభ్యసమావేశానికి పవార్, మరో అసంతృప్త ఎంపీ అలీ అన్వర్ గైర్జారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.