రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షా ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బీహార్‌లో సోమవారం చోటుచేసుకుంది. అభ్యర్థులు పెద్దఎత్తున పట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకొని పలు రైళ్లను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్ 2021 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)-2 పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు సీబీటీ-1 పరిక్షకు సంబంధించిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను జనవరి 15న విడుదల చేశారు.
ఈ ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సోమవారం ఒక్కసారిగా పట్నా రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున అభ్యర్థులు చేరి నిరసన చేపట్టారు. అక్కడితో ఆగకుండా సుమారు 5 గంటలపాటు స్టేషన్ రైలు పట్టాలపై బైఠాయించి పలు రైళ్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment