Railway Recruitment Board
-
పరీక్షా ఫలితాలపై అభ్యంతరం.. రైళ్లు అడ్డుకొని నిరసన
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షా ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బీహార్‌లో సోమవారం చోటుచేసుకుంది. అభ్యర్థులు పెద్దఎత్తున పట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకొని పలు రైళ్లను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్ 2021 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)-2 పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు సీబీటీ-1 పరిక్షకు సంబంధించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను జనవరి 15న విడుదల చేశారు. ఈ ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సోమవారం ఒక్కసారిగా పట్నా రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున అభ్యర్థులు చేరి నిరసన చేపట్టారు. అక్కడితో ఆగకుండా సుమారు 5 గంటలపాటు స్టేషన్ రైలు పట్టాలపై బైఠాయించి పలు రైళ్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్‌సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు. -
రైల్వేలో కాంట్రాక్టు నియామకాలు
న్యూఢిల్లీ: వేర్వేరు విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లోని కీలక రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. ఆవిరితో నడిచే లోకో మోటివ్‌లు, పాత రైల్వే బోగీలు, సిగ్నల్స్ నిర్వహణ, పరిరక్షణకు పదవీవిరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని తీసుకోనున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు నియామకాలను చేపట్టాలని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే నియామకాల బోర్డు(ఆర్ఆర్బీ) ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాజీ ఉద్యోగుల్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే అధికారాన్ని జోనల్ మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టు విధానంలో ప్రధానంగా స్టెనోగ్రాఫర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేస్తామన్నారు. -
89వేల పోస్టులకు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ : భారత రైల్వేలో ఖాళీగా ఉన్న 89,000 పైగా పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. గత నెలలో వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. 89వేల ఆర్ఆర్బీ ఉద్యోగాలకు దాదాపు కోటిన్నర మంది రిజిస్ట్రర్ చేసుకున్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రైమరీ రిజిస్ట్రేషన్‌లోనే దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారని పేర్కొన్నారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగ ప్రకటనను జారీచేసింది. వీటిలో గ్రూప్ సీకి చెందిన 26,502 పోస్టులుండగా.. గ్రూప్ డీకి చెందినవి 62,907 పోస్టులున్నాయి. మార్చి 31 ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రైమరీ రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థులు తమ పేరు, అడ్రస్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత దశలో దరఖాస్తులో ఇతర వివరాలను నింపి, ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు చెప్పారు. ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫాం ప్రిలిమరీ రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్నెంబర్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటోంది. ఈ పోస్టులకు ఎగ్జామ్‌ను రైల్వే రిక్రూట్మెంట్ 2018 ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ నిర్వహించనుంది. -
నిరుద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
నెల్లిమర్ల: నెల్లిమర్లకు చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నిర్వహించిన టెస్ట్‌లో అర్హత సాధించాడు. శారీరక సామర్థ్య పరీక్షలో కూడా పాసయ్యాడు. అదే అభ్యర్థి గతంలోనూ పలుమార్లు టెస్ట్, శారీరకసామర్థ్య పరీక్షల్లో పాసైనా ఉద్యోగం రాలేదు. దీంతో ఈ సారి కూడా ఉద్యోగం వస్తుందో..రాదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం ఓ దళారి(బ్రోకర్)కి తెలిసింది. ఇంకేం ఆ అభ్యర్థి తల్లిదండ్రులను కలిశాడు. తనకు రైల్వే మంత్రి తెలుసునని..రూ 3 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడు. దీంతో సందిగ్ధంలో ఉన్న సదరు అభ్యర్థి తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు ఆ దళారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న మొత్తాన్ని సదరు బ్రోకరుకు ఇచ్చేశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మెరిట్‌పై ఆ అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తానే ఉద్యోగం వేయించానని రూ. 2లక్షలు చల్లగా జేబులో వేసుకున్నాడు సదరు బ్రోకర్. ప్రస్తుతం నెల్లిమర్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల బలహీనతను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బాగా ప్రయత్నించి..ఒకట్రెండుసార్లు త్రుటిలో ఉద్యోగాలు తప్పిపోయిన అభ్యర్థులనే ఎంచుకుంటారు. తమకు సాక్షాత్తూ మంత్రులు, పెద్దస్థాయి అధికారులు తెలుసునని నమ్మబలుకుతారు. తమ ఫోన్లలో తమకు కావాల్సిన వారి నంబర్లనే మంత్రులు గాను, పెద్దస్థాయి అధికారులగాను నోట్ చేసుకుంటారు. అభ్యర్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచే ఆ నంబరుకు డయల్ చేసి లౌడ్స్పీకర్లో మాట్లాడి అందరినీ నమ్మిస్తారు. ఉద్యోగాలు వేయిస్తామని నమ్మబలికి బేరం కుదర్చుకుంటారు. అభ్యర్థి తన సామర్థ్యం మీద ఉద్యోగం సంపాదిస్తే తానేచెబుతూ మొత్తం సొమ్ము కాజేస్తాడు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే సంవత్సరాల తరబడి తిప్పి కొంత సొమ్ము ఖర్చు చెప్పి అతి కొద్ది మొత్తం తిరిగిస్తారు. దీన్నిబట్టి అభ్యర్థికి ఉద్యోగం వచ్చినా, రాకపోరుునా బ్రోకర్ల పంట పండుతుంది. ఎక్కువగా బ్యాంకు, రైల్వే పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీల్లోనూ ఉద్యోగాలు వేయిస్తామని ఇటీవల చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నెల్లిమర్ల మండల పరిసర ప్రాంతాల నుంచే సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రోకర్ల నుంచి అభ్యర్థులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. దళారులనునమ్మి మోసపోవద్దు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులెవ్వరూ దళారులను నమ్మవద్దు. ప్రస్తుతం కేవలం సామర్థ్యం మీదే ఉద్యోగాలు వస్తున్నాయి. దళారుల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో నిఘా సారిస్తున్నాం. ఎవరికి ఉద్యోగాలు వచ్చినా పోలీస్ విచారణ ఉంటుంది కాబట్టి బ్రోకర్ల విషయం బయటపడుతుంది. అభ్యర్థులు దళారులకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఉద్యోగాలిస్తాం అని వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. -రవికుమార్, విజయనగరం రూరల్ సీఐ