రైల్వే ఉద్యోగాలకు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ : భారత రైల్వేలో ఖాళీగా ఉన్న 89,000 పైగా పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. గత నెలలో వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. 89వేల ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు దాదాపు కోటిన్నర మంది రిజిస్ట్రర్ చేసుకున్నట్టు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రైమరీ రిజిస్ట్రేషన్‌లోనే దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారని పేర్కొన్నారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఉద్యోగ ప్రకటనను జారీచేసింది. వీటిలో గ్రూప్ సీకి చెందిన 26,502 పోస్టులుండగా.. గ్రూప్ డీకి చెందినవి 62,907 పోస్టులున్నాయి.
మార్చి 31 ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రైమరీ రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థులు తమ పేరు, అడ్రస్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత దశలో దరఖాస్తులో ఇతర వివరాలను నింపి, ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు చెప్పారు. ఆర్‌ఆర్‌బీ అప్లికేషన్ ఫాం ప్రిలిమరీ రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, తమ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్‌నెంబర్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటోంది. ఈ పోస్టులకు ఎగ్జామ్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ 2018 ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment