BJP Chief JP Nadda Faces Go Back Slogans At Patna - Sakshi
Sakshi News home page

JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బిగ్‌ షాక్‌.. ఉద్రిక్తతతో చేదు అనుభవం

Published Sat, Jul 30 2022 7:02 PM | Last Updated on Sat, Jul 30 2022 8:50 PM

BJP Chief Faces Go Back JP Nadda Slogans At Patna - Sakshi

JP Nadda.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా జేపీ నడ్డా వాపస్‌ జావో(వెనక్కి వెళ్లండి) అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. జేపీ నడ్డా శనివారం బీహార్‌ పర్యటనకు వచ్చారు. రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీకి చెందిన ఫ్రంట్‌ల సదస్సుల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా పాట్నాకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భవనం వద్దకు వచ్చి నిరసనలు తెలిపారు. 

ఈ క్రమంలో జేపీ నడ్డాను అడ్డుకుని.. జేపీ నడ్డా వాపస్‌ జావో(వెనక్కి వెళ్లండి) అంటూ నినాదాలు చేశారు. జాతీయ విద్యా విధానం-2020ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాట్నా యూనివర్శిటీకి కూడా కేంద్ర హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం, జేపీ నడ్డా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, అంతకు ముందు జేపీ నడ్డా పాట్నాలో రోడ్‌ షో నిర్వహించారు. ఇక, జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. సాయం రూ. 3వేలకు పెంపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement