
పాట్నా: బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన ఫలితాలను గాంధీ జయంతి సందర్బంగా బయటపెట్టింది. ఈ సర్వేలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ జనాభా లెక్కలు చాలా కీలకం కానున్నాయని బీహార్‌లోని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీహార్ ప్రభుత్వం చేపట్టిన జనాభా గణన నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం జనాభా 13.1 కోట్లకు పైగా ఉన్నారని అందులో వెనకబడిన వారు 27 శాతంగా ఉండగా మరింత వెనకబడిన వారు 36 శాతం ఉన్నారని తేలింది. అంటే బీహార్ రాష్ట్రంలో బీసీలే 63 శాతం ఉన్నారు. ఇక షెడ్యూల్డ్ కులాల వారు 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల వారు 1.7 శాతం, ఇక సామాన్య జనాభా మాత్రం 15.5 శాతం ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి.
బీహార్‌లో కుల ఆధారిత సర్వేకు శ్రీకారం చుట్టగానే దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా కూడా ప్రభుత్వం మాత్రం జనగణనపై గట్టి నమ్మకంతో ముందుకెళ్లింది. ఎప్పుడైతే పాట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో బీహార్ ప్రభుత్వానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దేశంలోనే జనాభాగణన పూర్తి చేసిన తొట్టతొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది.
ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’
Comments
Please login to add a commentAdd a comment