
నోయిడా : అతడో ప్రభుత్వ ఇంజినీరు. అయితే ఆయన కూడబెట్టిన ఆస్తులను చూసి ఆదాయపు పన్నుశాఖ అధికారులే అవాక్కు అయ్యారు. అధికారుల తనిఖీల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200కోట్ల అక్రమ ఆస్తులు బయటపడింది. వివరాల్లోకి వెళితే నోయిడాకు చెందిన బ్రిజ్‌పాల్ సింగ్ నోయిడా అథారిటీలో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక్కో భార్యకు ఇద్దరు కొడుకులు, ఒక్క కూతురు ఉన్నారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏక కాలంలో బ్రిజ్‌పాల్‌కు చెందిన రెండు కుటుంబాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 27 భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఖరీదైన కార్లు, 22 ఇతర డాక్యుమెంట్లతోపాటు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్లపైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా మరికొన్ని ఆస్తులను బ్రిజ్‌పాల్ తన బంధువుల పేరిట దాచి ఉంచినట్లు విచారణలో తేలిందని ఐటీ అధికారులు తెలిపారు. ఈ వార్త వెలుగులోకి రాగానే బ్రిజ్‌పాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారని, అలాగే అతగాడి అక్రమ ఆస్తుల వివరాలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆరా తీసినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment