ఉద్యోగంలో జీతం ఉంటుంది గానీ జీవితం కాదు.. అదే వ్యాపారం అయితే కాస్త కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఏదో ఓ రోజు జీవితం మనకు నచ్చినట్లు మారుతుందని నమ్మాడు.. చేసి చూపించాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ సుసారే 2015 లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, పూణేలోని ఒక ఎంఎన్‌సీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే ఆ జీతం సరిపోకపోయినా ఎలాగో జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు.
2017లో చైనాకు వ్యాపార పర్యటన కోసం వెళ్లడం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ సమయంలో అక్కడ డ్రమ్స్, టైర్లు వంటి ఉపయోగించిన వస్తువులను ఆకర్షణీయమైన ఫర్నిచర్‌గా రీసైక్లింగ్ చేసే అమ్ముతున్నారు. అప్పడే అతనికి ఓ ఐడియా వచ్చింది. తను కూడా ఈ బిజినెస్ చేద్దామని. ఇక భారత్‌కు తిరిగి రాగానే.. ఇటువంటి రీసైక్లింగ్ బిజినెస్ పెద్దగా ఎవరూ చేయడం లేదని తెలుసుకుని వెంటనే పీ2ఎస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీనీ స్థాపించాడు.డ్రమ్స్ టైర్‌లను ఫర్నిచర్‌గా ఎలా మార్చాలో గైడెన్స్ కోసం యూట్యూబ్‌లో చూసి నేర్చుకునే వాడినని, అలా మొదట్లో యూట్యూబ్‌లోనే ఎక్కువ కాలం గడిపినట్టు తెలిపాడు ప్రమోద్.
అయితే 2018 సెప్టంబర్‌లో వ్యాపారాన్ని ప్రారంభిస్తే డిసెంబర్ వరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. దీంతో అమ్మకానికి మార్కెటింగ్ ముఖ్యమని భావించిన ప్రమోద్ తన వస్తువులను అందరికీ కనిపించేలా రోడ్డు పక్కన ఉండే జ్యూస్ స్టాళ్ల దగ్గర, ఫుడ్ స్టాళ్ల దగ్గర ఈ ఫర్నీచర్‌ను ప్రదర్శించేవాడు. అలా జనవరి 2019లో పూణెలోని ఓ కేఫ్ యజమానికి అవి నచ్చడంతో 50 వేల రూపాయల ఆర్డర్ ఇచ్చాడు. దీంతో అతని దశ అప్పటి నుంచి తిరిగింది. ఆ తరువాత ఒకేసారి థానెలో పెద్ద ప్రాజెక్ట్ రాగా అందులో 5.5 లక్షలు సంపాదించాడు.
అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదని, అతని వ్యాపారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వ్యాపారం రూ .1 కోటి టర్నోవర్‌తో, 14 మంది సిబ్బంది ప్రమోద్ కంపెనీలో పని చేస్తున్నారు. 2022 నాటికి ముంబై, థానేలలో అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని తాను ప్లాన్ చేస్తున్నట్లు ఈ యువ వ్యాపారవేత్త తెలిపారు.
చదవండి:
Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క..
కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..
Anand Mahindra: గల్లీ క్రికెట్.. పిల్లల ఐడియాకి ఆనంద్ మహీంద్రా ఫిదా
Comments
Please login to add a commentAdd a comment