హోళీ ఉత్సవాలకోసం ఉత్తరప్రదేశ్లోని వృందావన్కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టి మరి లైంగికదాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. కృష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన ఆమె గత ఫిబ్రవరి 26న హోళీ ఉత్సవాల కోసం వృందావన్కు వచ్చి ఓ గెస్ట్ హౌస్లో దిగింది.
మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం తీవ్రగాయాలై స్పృహకోల్పోయిన ఆమెను పోలీసులు గుర్తించారు. మెలకువవొచ్చిన అనంతరం ఆమెను ప్రశ్నించగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. తులసీమాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.