ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు సోషల్ మీడియాలో ప్రముఖస్థానం సంపాదించుకుంటున్నారు. ఈ జాబితాలోకే వస్తారు మోనాలిసా.
కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తాముంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించారు. ఇటీవలి కాలంలో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి యూట్యూబర్లు ఆమె వెంటపడుతున్నారు. కొందరు ఆమెతో ఫోటోలు దిగాలని, మరికొందరు వీడియోలు తీయాలని తాపత్రయపడుతున్నారు.
दोस्तों मेरा इंस्टाग्राम अकाउंट किसी ने हैक कर लिया, बहुत जल्दी ही दूसरा एकाउंट बनाऊँगी।
हम बोल भी क्या सकते हैं, उम्मीद है कि बापस मिल जायेगा। pic.twitter.com/rRLlQE8sPZ— Monalisa Bhosle (@MonalisaIndb) January 25, 2025
మోనాలిసా 'ఎక్స్'లో ఒక వీడియోను షేర్ చేశారు. దీనిలో ఆమె ‘నేను ఇక్కడ ఉంటున్నాను. ఇది మా ఇల్లు. ఈ ప్రాంతంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారు. నేను పూసల దండలు అమ్మడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్ళాను. అక్కడ దండలు అమ్మడం కుదరలేదు. ఎవరో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా హ్యాక్ చేశారు. నా ఐడిని హ్యాక్ చేసిన వారు నా ఐడిని తిరిగి ఇవ్వండి. దాని నుండి ఎంతోకొంత సంపాదించాలనుకున్నాను’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment