
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్-2తో భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పాక్ మాత్రం ప్రతీకార దాడులు జరుపుతామని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి గూగుల్‌లో Indian Air Force, Pakistan Air Force, Balakot, surgical strike and LoC కీవర్డ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాకిస్తానీలు మాత్రం ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ కన్నా భారత వాయుసేనపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం గూగుల్ ట్రెండ్స్‌లో స్పష్టమైంది.
భారత్‌లో surgical strike కీ వర్డ్ ఎక్కువగా ట్రెండ్ అవ్వగా.. పాక్‌లో 'Balakot' కీ వర్డ్ ట్రెండ్ అయింది. అయితే భారత్ కన్నా ముందే ఈ దాడికి సంబంధించిన కీవర్డ్స్ పాక్‌లో ట్రెండ్ అవ్వడం గమనార్హం. పాక్‌లో 7.40 గంటలకు ఈ కీవర్డ్స్ ట్రెండ్ ప్రారంభమవ్వగా.. భారత్‌లో 8.50 గంటలకు ప్రారంభమైంది. ఇక 10 గంటల సమయం వరకు పాక్‌లో 'Balakot' కీ వర్డ్ పీక్స్‌కు వెళ్లగా.. భారత్‌లో surgical strike కీవర్డ్ దూసుకెళ్లింది. ట్విటర్‌లో సైతం #surgicalstrike ట్యాగ్ హల్‌చల్ చేసింది. గూగుల్‌లో 'Pakistan Army', 'Pakistan Air Force', 'Indian Air Force' 'Indian Army' కీవర్డ్స్ సెర్చ్‌ని పరిశీలించగా.. పాకిస్తానీయులు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కన్నా.. భారత ఎయిర్ ఫోర్స్ కీ వర్డ్‌నే ఎక్కువగా సెర్చ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment