బామ్మకు గూగుల్ సలాం | Grandmother's polite Google search goes viral | Sakshi
Sakshi News home page

బామ్మకు గూగుల్ సలాం

Published Fri, Jun 17 2016 2:04 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

బామ్మకు గూగుల్ సలాం

బామ్మకు గూగుల్ సలాం

లండన్: ఓ లండన్ బామ్మ విషయం ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. తరుచు టీవీలు చూసే అలవాటు ఉన్న ఆ బామ్మ తనకు కావాల్సిన ఒక పదానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ గూగుల్ సెర్చ్ బాక్స్ చాలా గౌరవంగా అడిగింది. ఆమె అడిగిన విధానాన్ని చూసిన మనుమడు ఆన్ లైన్లో పోస్ట్ చేయగా విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా గూగుల్ యాజమాన్యం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. తమ మొత్తాన్ని మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేసిన బామ్మగారు మీకు ధన్యవాదాలు అంటూ బదులు ఇచ్చింది. తనకు కావాల్సిన పదం కోసం అంతటి గౌరవపూర్వకంగా అడగడంపట్ల మరో థ్యాంక్స్ చెప్పింది. బ్రిటన్లోని అశ్వర్థ్ అనే 86 ఏళ్ల బామ్మకు బాగా టీవీ చూసే అలవాటు ఉంది.

అయితే, టీవీ చానెల్స్ వాళ్లు తమ రేటింగ్స్ స్థాయిని రోమన్ అంకెలలో ఇస్తుంటారు. అసలు ఈ పదాలకు అర్థం ఏమై ఉంటుందా తెలుసుకోవాలనుకున్న ఆ బామ్మ తన కంప్యూటర్లో 'దయచేసి ఈ రోమన్ సంఖ్యలకు అర్థం అనువాదం చేసి చెప్పగలరు.. కృతజ్ఞతలు' అంటూ టైప్ చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మనుమడు బెన్ ఎకర్ స్లీ తన బామ్మ చేసిన ప్రయోగానికి ముగ్దుడై బామ్మ ఫోటోను, ఆమె సెర్చ్ చేసిన కంప్యూటర్ కీ వర్డ్స్ను ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ ఫొటోకు, తక్కువ నిడివి ఉన్న వీడియోకు విపరీత స్పందన వచ్చి వైరల్ గా మారింది. గూగుల్ సంస్థ స్వయంగా బామ్మగారికి ధన్యవాదాలు అంటూ తెగ మెచ్చుకుంది. రోజుకు కొన్ని కోట్ల పదాలను వెతుకుతుంటారాని, ఆమె వెతికిన పదంమాత్రం తమకు నిజంగా నవ్వు తెప్పించిందని, అంతటి మర్యాదపూర్వకంగా అడిగిన ఆమెపై ఎంతో గౌరవం పెరిగిందటూ గూగుల్ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement