వాషింగ్టన్: ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరమేధాలు జరుగుతున్నాయి. అయితే అమెరికాలో వీటి శాతం చాలా ఎక్కువ. అమెరికాలో ఏటేటా తుపాకీ కాల్పుల మోత పెరుగుతూ వస్తోంది. మన దేశంలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా అమెరికాలో గన్స్ లభిస్తాయి. ఎంతలా అంటే అక్కడి పౌరుల చేతిలో గన్ ఉండటం ఓ అలవాటుగా మారుతోంది. అమెరికాలో స్వేచ్ఛగా బతకవచ్చని అందరూ భావిస్తుంటారు... కానీ, స్వేచ‍్ఛ హత్యలు జరుగుతున్నాయని గుర్తించడం లేదు. కోపం వచ్చినా, నచ్చని ఘటన జరిగినా... అక్కడి వారు చేసే పని తమ తుపాకీకి పని చెప్పడం.
కాల్పులకు పాల్పడ్డ యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు (ఫైల్)
జాతి విధ్వేషమనీ కొందరు, డబ్బుల కోసమనీ మరికొందరు, సరదా కోసం ఇంకొందరు.. ఇలా ఏదో రకంగా ఇతరుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. అక్కడి వారి చేతుల్లో గన్ అత్యవసర సరుకుగా మారింది. గత కొంతకాలం నుంచి జాతి విధ్వేషదాడులు మరీ ఎక్కువ కాగా, ఆసియా వాసులు ముఖ్యంగా భారతీయులైతే మరీ బిక్కు బిక్కుమంటూ పరాయి దేశంలో గడపాల్సి వస్తోంది. ఈ మధ్య ఫ్లోరిడా హైస్కూల్‌లో జరిగిన నరమేధంలో దాదాపు 17మంది అమాయక విద్యార్థులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదంతో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు మొత్తం విస్తుపోయాయి.
ఫ్లోరిడా నరమేధం ముందువరకు అమెరికా పౌరులు గన్ షాప్‌లు ఎక్కడ? గన్స్ ఈజీగా ఎక్కడ దొరుకుతాయి? అని గూగుల్‌లో వీటి గురించే వెతికేవారు. అమెరికన్లు సెర్చ్ చేసే వాటిలో గన్స్, గన్ కల్చర్ టాప్ లిస్ట్‌లో ఉండేవి. కానీ ఆ ఉదంతం తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. ఇప్పుడు అమెరికా పౌరులంతా.. గన్ కల్చర్‌ను ఎలా కంట్రోల్ చేయాలి? అందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి? మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గన్ కల్చర్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. లాంటి వాటికోసం గూగుల్‌లో వెతుకుతున్నారని ఓ తాజా సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment