ఫ్లోరిడా : అమెరికాలో ఇద్దరు పోలీసుల సమయస్పూర్తి 14 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడగలిగింది. అనా గ్రాహం తన కూతురు లూసియాతో కలిసి ఫ్లోరిడాలోని గార్డెన్ మాల్‌కు వచ్చింది. అదే సమయంలో చిన్నారి ఆహారం తీసుకుంటుండగా గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోలేకపోయింది. ఇది గమనించిన అనా గ్రాహం ఏం చేయాలో తెలియక తన కూతురుని కాపాడాలంటూ ఏడుస్తూ గట్టిగా అరిచింది. మాల్‌లోని ఫుడ్ కోర్డులో భోజనం చేయడానికి వచ్చిన పోలీసులు రాబర్ట్ అయాల, రఫెల్ గడాలుప్ తల్లి ఆర్తనాధాలను విన్నారు. వెంటనే స్పందించి చిన్నారి దగ్గరకు పరుగున వెళ్లారు.
ఓ అధికారి కుర్చీపై కూర్చొని చిన్నారిని తలకిందకు ఉండేలా ఓ చేతిపైనే బోర్లా పడుకోబెట్టారు. ఆ తర్వాత మరో చేతితో వీపుపై చరుస్తూ ఒత్తిడి తీసుకువచ్చారు. కొద్ది సేపటి తర్వాత లూసియాగొంతులో ఇరుక్కున్న ఆహారం బటయకు వచ్చింది. దీంతో అక్కడున్నవారందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు చిన్నరిని కాపాడిన సంఘటన అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీన్ని గత శుక్రవారం అధికారులు విడుదల చేయగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుంతోంది. ఆహారం తింటూనే మధ్యలో లేచి వచ్చి చిన్నారిని కాపాడిన అధికారులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరో వైపు చిన్నారి తల్లి అధికారులు చేసిన సహాయాన్ని జీవితాంతం మరువలేనంటూ వారికి ఓ లేఖ రాశారు. లూసియా ఎదుర్కొన్న సమస్యకు తక్షణ పరిష్కారం చూపించి ఆమె ప్రాణాలను కాపాడరని కొనియాడారు. పాప ప్రాణాలు కాపాడాలని భగవంతుడే మిమ్మల్ని పంపించి ఉంటాడు అంటూ పేర్కొన్నారు. ది పామ్ బీచ్ గార్డెన్ సిటీ కౌన్సెల్ ఇద్దరు పోలీసులు రాబర్ట్ అయాల, రఫెల్ గడాలుప్‌లను లైఫ్ సేవింగ్ అవార్డుకు ఎంపికచేసింది.
Comments
Please login to add a commentAdd a comment