
ఇక తెలుగులోనూ గూగుల్ సెర్చ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా తన వాయిస్ సెర్చ్ ఫీచర్‌కు తెలుగు భాషను యాడ్ చేసింది. దీంతో ఇక తెలుగులో చెబుతూనే గూగుల్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. తెలుగుతోపాటు ఇకనుంచి తమిళ్, మలయాళం, బెంగాలి, గుజరాతి, కన్నడ, మరాఠి, ఉర్దూ భాషల్లోనూ గూగుల్‌ను జల్లెడ పట్టొచ్చు.
కాగా ఇదివరకు కేవలం ఆంగ్లం, హిందీలో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుగులో చెబుతూ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో ఉన్న ‘సెర్చ్ లాంగ్వేజ్’ ఆప్షన్‌లో ఆంగ్లం బదులుగా తెలుగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.