గూగుల్ సెర్చిలన్నీ మోడీ కోసమే! | Narendra Modi most searched CM on Google | Sakshi
Sakshi News home page

గూగుల్ సెర్చిలన్నీ మోడీ కోసమే!

Published Wed, Mar 19 2014 7:53 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

గూగుల్ సెర్చిలన్నీ మోడీ కోసమే! - Sakshi

గూగుల్ సెర్చిలన్నీ మోడీ కోసమే!

మనకున్న మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో.. ఎవరి కోసం ఎక్కువగా గూగుల్లో సెర్చి చేశారో తెలుసా? ఏమాత్రం అనుమానం అక్కర్లేదు.. నరేంద్ర మోడీ కోసమే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సెర్చింజన్ గూగుల్ తన ట్రెండ్స్ వివరాలను బయటపెట్టింది. డిసెంబర్ 13 నుంచి మార్చి 13 వరకు మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గూగుల్ ఈ వివరాలను తెలిపింది.

దేశం మొత్తమ్మీద అత్యధికం సెర్చి చేసిన ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు సీఎం జయలలిత, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ నిలిచారు. ఇంకా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, జమ్ము కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేరళ సీఎం ఊమెన్ చాందీ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించినట్లు గూగుల్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement