
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ప్రాబల్యం పెంచుకున్న వాటిలో గూగుల్ ఒకటి. ఇవాళ ఏ కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళైయినా గూగుల్‌ను టచ్ చెయ్యకుండా ఉండలేరు. అంతగా ప్రాముఖ్యతను గూగుల్ సంతరించుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గూగుల్ అన్వేషణలో రెండవ స్థానంలో నిలిచిన నటిగా నటి రాధికా ఆప్తే పేరు నమోదవ్వడం విశేషం. ఇంకా చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇటీవల కన్ను మూసిన అబ్దుల్ కలామ్ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానాన్ని నటి రాధిక ఆప్తే పొందారు.
ఇందుకు కారణాలేమిటన్న విషయం గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఆమె సంచలన ప్రచారాలకు కేంద్ర బిందువు కావడమే నని భావించాల్సి ఉంటుంది. హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన రాధికా ఆప్తే మరాఠీలో నటించిన ధోని చిత్ర తమిళ రీమేక్ ద్వారా ఆమెను నటుడు ప్రకాష్‌రాజ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత తమిళ్ సెల్వన్ లాంటి రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి ప్రచారమే పొందారు. తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇవన్నీ పక్కన పెడితే రాధికా ఆప్తే హిందీలో సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో అహల్య అనే 13 నిమిషాల లఘు చిత్రంలో పిచ్చపిచ్చగా అందాలారబోశారు.
ఆ చిత్రాన్ని సమీపకాలంలో యూట్యూబ్‌లలో పెట్టారు. రాధికా ఆప్తే శృంగారాన్ని ఒలకబోశారనగానే అవకాశం ఉన్న వారందరూ ఆ లఘు చిత్రాన్ని చూడడానికి గూగుల్‌ను టచ్ చేశారు.అంతకంటే ముందు మరో షార్టు ఫిలింలో రాధికాఆప్తే నగ్నంగా నటించారనే ప్రచారం జరగడంతో అది చూడడానికి గూగుల్ వీక్షకులు విరగపడ్డారు. ఇత్యాది సంఘటనలతో జూలై 22 వరకూ గణాంకాల ప్రకారం గూగుల్ అన్వేషణలో రాధికా ఆప్తే రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నారు. ఆ తరువాత రాధికా ఆప్తే హల్‌చల్ ఏ లెవల్‌ల్లో ఉంటుందో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.