Google: వెతుకులాట.. అలా మొదలైంది | Did You Know What Is The First Word Search In Google Search | Sakshi
Sakshi News home page

గూగుల్‌ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం

Published Sun, Sep 5 2021 2:34 PM | Last Updated on Sun, Sep 5 2021 2:52 PM

Did You Know What Is The First Word Search In Google Search - Sakshi

ఏ ప్రశ్నకైనా సమాధానం కావాలన్నా, ఎటువంటి విషయంలోనైనా అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలన్నా.. గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే అని ఫిక్స్‌ అయిపోతోంది మనిషి మెంటాలిటీ.  అందుకే రోజూ లక్షల ప్రశ్నలతో సెర్చ్‌ పేజీలను క్రియేట్‌ చేసుకునేందుకు శ్రమిస్తోంది గూగుల్‌కి. ఇంతకీ ఈ ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో మొట్టమొదటగా సెర్చ్‌ చేసిన పదం ఏదో తెలుసా?


ఇంటర్నెట్‌లో మనం ఏదైనా వెతకాలంటే సెర్చ్‌ చేయడం అని కాకుండా.. ‘గూగుల్‌ ఇట్‌’ అంటున్నాం. అంటే.. సెర్చింజిన్‌తో మనిషి జీవితంలో అంతలా పాతుకుపోయింది గూగుల్‌ సెర్చ్‌. సుమారు 23 ఏళ్ల క్రితం ఆసక్తికరంగానే మొదలైంది.  ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు ‘బ్యాక్‌రబ్‌’ పేరుతో సెర్చ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఒకదానిని తయారు చేశారు. అప్పటికే ఆల్ట్‌విస్టా, లైకోస్‌, ఆస్క్‌ జీవ్స్ లాంటి సెర్చ్‌ ఇంజిన్‌లు ఉన్నాయి. అయితే అప్పటిదాకా పరిమితంగా ఇంటర్నెట్‌లో ఉన్న వెతుకులాటను.. ఆ పరిధిని దాటిపోయేలా రూపొందించారు వీళ్లిద్దరూ.
 

1998 సెప్టెంబర్‌ 5న బ్యాక్‌రబ్‌(ఇదే గూగుల్‌ అయ్యింది) స్టాన్‌ఫోర్డ్‌ ఇంజినీరింగ్‌ స్కూల్‌ డీన్‌ జాన్‌ హెన్నెస్సీకి చూపించారు. ఆయన అప్పటి యూనివర్సిటీ చైర్మన్‌ గెర్‌హెర్డ్‌ కాస్‌పర్‌ అనే పేరును టైప్‌ చేశాడు. ఆల్టావిస్టాలో అదే సెర్చ్‌ ‘కాస్పర్‌ ది ఫ్రెండ్లీ ఘోస్ట్‌’ అని చూపించగా.. వీళ్లు తయారు చేసిన సెర్చ్‌ ఇంజిన్‌లో మాత్రం సరైన రిజల్ట్‌(గెర్‌హర్డ్‌ కాస్సర్‌కు సంబంధించిన వివరాలే) వచ్చాయి.

ఆ తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పేరు వైట్‌హౌజ్‌ రాసలీలల వ్యవహారంతో ప్రపంచమంతా మారుమోగిపోగా.. గూగుల్‌లో సెర్చ్‌ కోసం బిల్‌ క్లింటన్‌ పేరుతో ప్రత్యేక పేజీని క్రియేట్‌ చేశారు.

  • బ్యాక్‌రబ్‌.. కంప్యూటర్‌ గ్రాడ్యుయేట్స్‌ ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ల బ్యాక్‌రబ్‌ సృష్టి.. కోడింగ్‌ అందించిన స్కాట్‌ హాసన్‌   
  • 1998లో బ్యాక్‌బర్‌.. గూగుల్‌గా మార్పు
  • గూగుల్‌ అనే పదం గూగోల్‌ నుంచి వచ్చింది. దాని విలువ టెన్‌ టుది పవర్‌ ఆఫ్‌ 100. దానర్థం.. అపరిమితం. అందుకే ఆ పేరు పెట్టారు. 
  • 2000లో ఇంటర్‌నేషనలైజేషన్‌ అయ్యింది. మొత్తం పదమూడు లాంగ్వేజ్‌ల్లో రిలీజ్‌ అయ్యింది.
  • 2001 నుంచి గూగుల్‌ న్యూస్‌, గూగుల్‌ బుక్స్‌, గూగుల్‌ స్కాలర్‌
  • 2007లో సెర్చ్‌ ఇంజిన్‌ను వర్టికల్‌గా మార్చేసి.. యూనివర్సల్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా మార్చేశారు.
     
  • 2009లో గూగుల్‌ రియల్‌ టైంకి వెళ్లింది. తద్వారా లేటెస్ట్‌ ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌ కనిపించడం మొదలైంది
  • 2010 నుంచి.. హౌ, వై, వేర్‌, వాట్‌.. ఇలాంటి పదాలతో సెర్చ్‌ వ్యవహారం మొదలైంది.
     
  • 2012లో.. గూగుల్‌ వికీపీడియాకు వెళ్లింది. అప్పటి నుంచి జ్ఞానభాండాగారంగా మారిపోయింది.
  • 2014లో.. పాత సెర్చ్‌ విషయాల్ని తొలగించే వెసులుబాటును తీసుకొచ్చింది

చదవండి:  ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆఫర్‌, గూగుల్‌ స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement