గూగుల్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా! | Youth to know the best way job details through Google Job search | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!

Published Tue, Aug 12 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

గూగుల్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!

గూగుల్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!

జాబ్ స్కిల్స్: అన్నీ వేదాల్లో ఉన్నాయష... అన్నట్లుగా గూగుల్‌లోనూ సమస్తం ఉన్నాయి. ఇందులో ప్రపంచాన్నే వీక్షించొచ్చు. ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌ను ఉపయోగించే వారందరికీ గూగుల్‌తో తప్పని సరిగా పరిచయం ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తుం టారు. ఉద్యోగాల వేటలోనూ యువతకు ఇది ఎంతగానో సహకరిస్తోంది.
 
 గూగుల్ ప్రపంచంలోని కొలువుల వివరాలను క్షణాల్లో కళ్లముందుంచుతోంది. నిజంగా ఇదొక శక్తివంతమైన సాధనం. దీన్ని సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా ఉద్యోగం గురించి సమాచారం కావాలంటే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి దానికి సంబంధించిన పదాలను టైప్ చేస్తుంటాం. కొన్నిసార్లు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరక్కపోవచ్చు. గూగుల్‌లో జాబ్ సెర్చ్‌కు కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే శ్రమ లేకుండా తక్కువ సమయంలోనే కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు.
 
  సరైన పదం టైప్ చేయాలి
 ఉద్యోగం కావాలంటే మొదట జాబ్ లేదా జాబ్స్ అనే పదం, తర్వాత జాబ్ టైటిల్, కావాల్సిన ప్రాంతం పేరును వరుస క్రమంలో టైప్ చేయాలి. ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్లు టైప్ చేస్తేఅసలైన సమాచారం లభించదు.
 
  కొటేషన్ మార్కులు
 కొన్ని పదాలను టైప్ చేస్తే.. ఆ పదాలున్న పేజీలు ప్రత్యక్షమవుతాయి. ఇవి వందలు, వేలల్లో ఉండే అవకాశం ఉంది. వీటిలో కావాల్సిన పేజీలను వెతుక్కోవడం కష్టమే. ఇలాంటి సందర్భాల్లో కొటేషన్ మార్కులను ఉపయోగించాలి. ఉదాహరణకు entry level jobs  అనే పదాన్ని కొటేషన్లలో "entry level jobs'' అని రాస్తే వరుసగా అవే పదాలున్న పేజీలు వస్తాయి. కావాల్సిన పేజీని చూసుకోవడం సులభమవుతుంది.
 
  క్యాపిటల్ లెటర్స్
 రెండు విషయాలకు సంబంధించిన వివరాలు కావాలంటే ఆ రెండు పదాల మధ్య or అని రాస్తుంటాం. కానీ, ఇలాంటి సందర్భాల్లో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉపయోగించాలి. చిన్న అక్షరాలను టైప్ చేస్తే గూగుల్ గుర్తించలేదు. అంటే OR అని పెద్ద అక్షరాలను టైప్ చేయాలి. దీనివల్ల ఆ పదాలున్న పేజీలే తెరపైకి వస్తాయి. ఉదాహరణకు Jobs in Telecom OR Power.
 
  స్పేస్ వదిలేయండి
 కొన్నిసార్లు సరైన పదాలు ఏమిటో తెలియదు. ఇలాంటప్పుడు ఒక పదం రాసి, దాని ముందు స్పేస్ వదిలేస్తే.. గూగుల్ దాన్ని పూరిస్తుంది. ఉదాహరణకు స్పేస్ ఇచ్చి మేనేజర్ జాబ్స్ అని టైప్ చేస్తే.. ఇంజనీరింగ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి వివిధ రకాల మేనేజర్ పోస్టుల వివరాలు తెరపైకి ప్రత్యక్షమవుతాయి. ఒక విభాగానికి సంబంధించిన వివరాలు కావాలంటే మొదట  ్ణ గుర్తును, తర్వాత పదాన్ని టైప్ చేయాలి. ఉదాహరణకు  lawer jobs అని టైప్‌చేస్తే లీగల్, అటార్నీ వంటి న్యాయ సంబంధ ఉద్యోగాల వివరాలన్నీ తెలుస్తాయి.
 
  సైట్లు తెలుసుకోండి
 ఉద్యోగాల సమాచారం ఇస్తున్న వెబ్‌సైట్లు ఎన్నో ఉన్నాయి. ఏ సైట్‌లో ఏ ఉద్యోగంపై ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోవాలంటే... గూగుల్ సెర్చ్‌లో site: అని టైప్‌చేసి, ఆ పోస్టును టైప్ చేయాలి. ఉదాహరణకు site:software developer అని టైప్ చేస్తే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల వివరాలున్న వెబ్‌సైట్లన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గూగుల్ సెర్చ్‌లో టైప్ చేసే పదాల్లో అక్షరాల మధ్య ఎలాంటి స్పేస్‌లు, అనవసరమైన గుర్తులు లేకుండా జాగ్రత్తపడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement