గూగుల్‌ సెర్చ్ లో అవే టాప్‌..!‌ | what Indians Searches In Google 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌-10 లో నాలుగు ఆహార పదార్దాలే...!

Published Wed, Dec 9 2020 8:28 PM | Last Updated on Wed, Dec 9 2020 10:36 PM

what Indians Searches In Google 2020 - Sakshi

ఏదైనా వెతకాలంటే అందరూ మొదటగా తెరిచేది గూగుల్‌. అదే గూగుల్‌ ఈ సంవత్సరం ఏది ఎక్కువ వెతికారో ఆ సంస్థ బయట పెట్టింది. గూగుల్‌ సెర్చ్‌ టాప్‌ 10 లో నాలుగు అహార పదార్ధాలకు సంబంధించినవే ఉన్నాయి. ఇందులో ఎలా చేయాలి అనే వెతికిన​వాటిని చూస్తుంటే ప్రజలందరూ లాక్‌డౌన్‌లో ఎలా గడిపారో అర్థమవుతుంది. అయితే సెర్చ్‌ చేసిన వాటిలో పన్నీర్‌ ఎలా చేయాలి అనేది టాప్‌లో ఉంది. తరువాత రోగ నిరోధక శక్తి ఎలా పెంచకోవాలి అని రెండవ స్ధానంలో ఉండగా డల్‌గోనా కాఫీ ఎలా తయారు చేయాలని మూడవ స్థానంలో ఉంది. 
ఇక ఆహార ప్రియులు డెజర్ట్ట్స్ ని , స్వీట్స్‌ ని ఇష్టపడని  వారు ఉండరు. అయితే ఇందులో వెతికిన వాటిల్లో కేకు తయారీ ఎలా? జిలేబి ఎలా తయారు చేయాలి? అని లాక్‌డౌన్‌ సమయంలో బయటికి వెళ్లలేక ఇలా వెతికారు. ఇవే కాకుండా పాన్‌ కార్డుకి ఆధార్‌ ఎలా లింక్‌ చేయాలి? ఫాస్టాగ్‌కి ఎలా రీఛార్జ్‌ చేయాలి? కరోనా వైరస్‌ని ఎలా నిరోధించాలి? అంతేకాకుండా ఈ-పాస్‌కి ఎలా అప్లై చేయాలి? అనేవి కూడా లిస్ట్ లో ఉన్నాయి. 
ఎలా అనేవి అలా ఉండగా ఇంక అసలు అది ఏమిటి? అనేవి కూడా సెర్చ్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్‌ గురించి, నెపోటిజమ్‌, ప్లాస్మా థెరపీ, కోవిడ్‌-19,సిఏఏ,సూర్య గ్రహణం, హంటా వైరస్‌ వీటన్నింటిని గురించి ప్రశ్నలో జాబితాలో ఉన్నాయి. 2020లో కరోనా వైరస్‌ సెర్చ్‌లో ఆధిపత్యం కనబరిచినప్పటికి ఐపీఎల్‌ టాప్‌ స్థానంలో నిలించింది. దీని తరువాత కరోనా వైరస్‌, అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్‌ యోజన,బీహార్‌ ఎన్నికలు, డిల్లీ ఎన్నికలు జాబితాలో ఉన్నాయి. 
ఇంక 2020లో ఎక్కువగా వ్యక్తులను వెతికి టాప్‌లో నిలిచిన వారిలో జో బిడెన్‌, అర్ణబ్‌ గోస్వామి, కనికా కపూర్‌, కిమ్‌ జాంగ్‌ యున్‌, అమితా బచ్చన్‌, రషీద్‌ ఖాన్‌, రియా చక్రవర్తి, కమలా హారిస్‌, అంకిత లోకండె, కంగనా రనౌత్‌ నిలిచారు. దిల్‌ బెచారా సినిమా ఇండియాలో ఎక్కువగా వెతికిన సినిమాలల్లో టాప్‌లో నిలిచింది. ఇంకా సూరారై పట్రు,తానాజీ,శకుంతలదేవి, గుంజన్‌ సక్సేనా సినిమాలు టాప్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement