confarence
-
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
న్యూఢిల్లీ: అద్భుత ప్రగతి పథంలో దూసుకెళ్తూ ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సదస్సులో ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేసి పలు అంశాలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. డబుల్ ఏఐ ప్రయోజనాలు ‘‘మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుతమైన ప్రతిపథంలో నడిపిస్తున్నాం. యుద్దాలు, సంక్షోభాలుసహా ప్రపంచాన్ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంలా మారింది. రెండు ఏఐల అదనపు ప్రయోజనాలు భారత్సొంతం. ఒకటి ఆశావహ ఇండియా(ఏఐ), కాగా మరోకటి కృత్రిమమేథ(ఏఐ). ఈ రెండింటి కలయికతో భారత్ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆపత్కాలాల్లో ప్రపంచం భారత్‌ను ఒక స్నేహితునిలా చూస్తుంది. కోవిడ్ మహమ్మారివేళ ఎన్నో దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరాచేసింది. ఏ దేశంతోనూ భారత్ బంధం గాలివాటంగా ఏర్పడలేదు. ఎంతో నమ్మకం, సత్సంబంధాలతో బలోపేతమైంది. భారత్ బాగుపడితే అసూయపడే దేశాలు లేవు. ఎందుకంటే భారత దేశ అభివృద్ధి ఫలాలు ప్రపంచదేశాలకూ పనికొస్తాయని అందరికీ తెలుసు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రపంచఅభివృద్ధిలో భారతపాత్ర ఎనలేనిదని స్పష్టమవుతోంది. అయితే గత దశాబ్దాల్లో వలసపాలన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగం మొదలైంది. అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటోంది’’ అని అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్యవిలువల్ని మేళవించాం ‘‘ డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువల్ని సమ్మిళితం చేశాం. అలాంటి సాంకేతికతే సాధికారత, పారదర్శకతలకు పనిముట్టుగా మారుతుంది. సాంకేతిక దన్నుతో ఎదిగిన యూపీఐ, పీఎం గతి శక్తి, ఓఎన్డీసీ వంటివి ఇందుకు మేలిమి తార్కాణాలు. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందడం మాత్రమేకాదు ఒక శక్తిగా అవతరిస్తోంది. పేదరికం వంటి సవాళ్లు ఉన్నాయని తెలుసు. త్వరితగతిన నూతన విధాననిర్ణయాలను అమలుచేస్తూ సంస్కరణలు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు ‘‘మానవాళి చరిత్రలో 21 శతాబ్దపు ఈ కాలం ఎంతో ముఖ్యమైంది. సమస్యలను పరిష్కరించుకుంటూనే సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మానవాళికి మెరుగైన భవిష్యత్తు అవసరం. అందుకోసం భారత్ పాటుపడుతోంది. దేశంలో గత ఆరుదశాబ్దాల్లో తొలిసారిగా వరుసగా మూడుసార్లు ఒకే ప్రభుత్వానికి ప్రజలుపట్టంకట్టారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారని హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ రుజువుచేశాయి. మూడోదఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేం రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలికవసతుల ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ 125 రోజుల్లో స్టాక్‌మార్కెట్ సైతం ఆరేడు శాతం వృద్ధిని చూపిస్తోంది’’ అని మోదీ అన్నారు. మోదీ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ సదస్సులో మాట్లాడారు. ‘‘ బ్రిటన్‌లో మార్గరేట్ థాచర్, టోనీ బ్లెయిర్ కాలం నుంచి చూసినా మా దేశంలో ఎవరూ మూడోసారి ప్రధాని కాలేదు. మీరు(మోదీ) మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు’’ అని కామెరూన్ పొగిడారు. -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్‌లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్‌తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్‌లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
తెలంగాణ చారిత్రక నేపథ్యంపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీ ల్లో తెలంగాణ చారి త్రక నేపథ్యం, నాగరి కత సంబంధిత విష యాలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో అంతర్జా తీయ సదస్సు నిర్వహిసున్నట్లు సాంస్కృ తిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూ లాల్ తెలిపారు. తెలంగాణ ప్రాచీన వారసత్వ సంపద, పాలించిన రాజులు, చారిత్రక కట్టడాలు, వాటి ఆధారాలను ప్రపంచానికి తెలపడమే ఈ సదస్సు ఉద్దేశమని వెల్లడించారు. గురువారం సచివాలయంలో చందూలాల్ మాట్లా డుతూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు అమెరికా, రష్యా, ఇటలీ, గ్రీస్ దేశాలకు చెందిన విశ్లేషకులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌ను హెరిటేజ్ తెలంగాణగా మారుస్తున్నామని తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం 6 ప్యానెళ్లు ఉంటాయని, ఇందులో 35 మంది పాల్గొంటారన్నారు. ప్రతి ప్యానె ల్లో అంశంపై ప్రదర్శనతోపాటు చర్చా గోష్టి ఉంటుందన్నారు. -
కమీషన్ల కోసమే కౌన్సిల్ సమావేశం వాయిదా..?
కోదాడ : ‘మున్సిపల్ కమిషనర్ ఎజెండా తయారు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు...ఆయన వల్లే మున్సిపల్ సమావేశం నిర్వహించలేక పోతున్నాం..’ ఇది గతంలో కోదాడ పురపాలక పెద్దలు నిత్యం వల్లే వేసిన మాటలు. మూడు నెలలపాటు సమావేశం నిర్వహిచంకపోతే పాలకవర్గం రద్దు అవుతుందని ఎజెండా లేకుండానే ఆదరబాదరగా సమావేశం నిర్వహించారు. దీనకంతటికి కారణం పాత కమిషనరే సహకరించకపోవడమేనని చైర్పర్సన్ పదే పదే చెప్పేవారు. కాని పాత కమిషనర్ వెళ్లిపోయాడు. కొత్త కమిషనర్ వచ్చి నెలరోజులు దాటింది కాని.. నేటికీ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు. అసలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలే ని పరిస్థితి. దీంతో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4 కోట్ల పనులు కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికితోడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఆమోదం పొందక పోవడంతో ఐదు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఐదుశాతం కమీషన ముందే ఇవ్వాలి..? కోదాడ మున్సిపాలిటీలో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4కోట్ల విలువైన పనులకు గతంలో టెండర్లు పిలిచారు. వాటిని తెరిచారు. ఇక సమావేశంలో వాటిని పెట్టి ఆమోదించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడమే తరువాయి. కాని పాత కమిషనర్‌కు, చైర్‌పర్సన్‌కు మధ్య ఉన్న విభేదాలతో సంవత్సర కాలంగా అవి వాయిదా పడ్డాయి. త్వరలో నిర్వహించే సమావేశ ఎజెండాలో సదరు పనులను పెట్టాలంటే ముందుగానే తమకు 5 శాతం వాట ఇవ్వాలని కొందరు పెద్దలు భేరం పెట్టినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు 15 మంది కాంట్రాక్టర్లు గత బుధవారం సమావేశమై దీనిపై తీవ్రంగా చర్చించినట్లు తెలిసింది. కొందరు ఇవ్వడానికి అంగీకరించగా మరికొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇది ఎటూ తెమలకపోవడంతో సమావేశం నిర్వహించంకుండానే జూలై నెల గడిచిపోయింది. పాపం..పారిశుద్ధ్య కార్మికులు..! మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీరి కాల పరిమితి మార్చి నెలతో ముగిసిపోయింది. ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టర్ లేక పోవడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. పాత కాంట్రాక్టర్ మార్చి నెల జీతం ఇవ్వలేదు. తరువాత నాలుగు నెలలు ఏజెన్సీ లేక పోవడంతో మొత్తం ఐదు నెలలుగా వారికి వేతనాలు లేవు. కొత్త ఏజెన్సీ టెండర్లు ఆమోదించడానికి కూడా భారీ మొత్తంలో కొందరు పాలకులు డిమాండ్ చేస్తుండడంతో ఇది కార్మికుల వేతనాలపై ప్రభావ చూపుతుందని కొందరు కౌన్సిలర్లే అంటున్నారు. మొత్తం మీద కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో, మరి ఈ ఆరోపణలకు ఎప్పుడు తెరదించుతారో వేచి చూడాలి. ఆరోపణలు చేసేవారి గురించి ప్రజలకు తెలుసు –వంటిపులి అనిత, చైర్పర్సన్ కోదాడ మున్సిపాలిటీలో అవినీతి పరుడైన పాత కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని పనులు జరగకుండా చేసినవారే ఇప్పుడు పసలేని ఈ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి పట్టణ ప్రజలకు అంతా తెలుసు. మున్సిపాలిటీలో హరితహారం జరుగుతుంది. ఆగస్టు 3న మెగా ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. అందువల్లే సమావేశం పెట్టడం ఆలస్యం అవుతుంది. ఎజెండా తయారవుతుంది. మరో వారం పది రోజుల్లో సమావేశం పెడతాము. పట్టణ ప్రజల సమస్యలు తీర్చడానికి కషి చేస్తున్నాం. ఈ లాంటి ఆరోపణలు పట్టించుకోం.