
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీ ల్లో తెలంగాణ చారి త్రక నేపథ్యం, నాగరి కత సంబంధిత విష యాలపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అంతర్జా తీయ సదస్సు నిర్వహిసున్నట్లు సాంస్కృ తిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూ లాల్ తెలిపారు. తెలంగాణ ప్రాచీన వారసత్వ సంపద, పాలించిన రాజులు, చారిత్రక కట్టడాలు, వాటి ఆధారాలను ప్రపంచానికి తెలపడమే ఈ సదస్సు ఉద్దేశమని వెల్లడించారు.
గురువారం సచివాలయంలో చందూలాల్ మాట్లా డుతూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు అమెరికా, రష్యా, ఇటలీ, గ్రీస్ దేశాలకు చెందిన విశ్లేషకులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌ను హెరిటేజ్ తెలంగాణగా మారుస్తున్నామని తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం 6 ప్యానెళ్లు ఉంటాయని, ఇందులో 35 మంది పాల్గొంటారన్నారు. ప్రతి ప్యానె ల్‌లో అంశంపై ప్రదర్శనతోపాటు చర్చా గోష్టి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment