సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి చందూలాల్
ములుగు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన , పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. మండలంలోని అబ్బాపురంలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతు భరోసాగా వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసి అధిక దిగుబడులను సాధించాలన్నారు.
వ్యవసాయం పండుగలా చేసుకోవాలి : ఎంపీ సీతారాంనాయక్
రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు వేల చొప్పున సాయం చేయడం దేశంలోనే ఎక్కడే లేదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి మునుకుంట్ల సంతోష్, అబ్బాపురం, జాకారం సర్పంచ్‌లు తప్పెట్ల మొగిలి, గండ్రత్ సాగర్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఎంపీపీ భూక్య మంజూల, ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment