యాపిల్‌ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..? | Apple Worldwide Developers Conference Dates Been Released | Sakshi
Sakshi News home page

యాపిల్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలు విడుదల

Published Mon, Apr 1 2024 12:30 PM | Last Updated on Mon, Apr 1 2024 3:06 PM

Apple Worldwide Developers Conference Dates Been Released - Sakshi

ప్రపంచ టెక్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(WWDC) తేదీలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌ను వర్చువల్‌ వేదికగా జూన్‌ 10 నుంచి జూన్‌14 వరకు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుత టెక్‌ ప్రపంచంలో ఏఐ హవా అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో యాపిల్‌ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్‌ ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్‌, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలిసింది.

ఐపాడ్‌ ఎయిర్‌, ఓఎల్‌ఈడీ ఐపాడ్‌ ప్రోలో కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉందని అంచనా. యాపిల్‌ నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌ ఆన్‌లైన్‌ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్‌ డెవలపర్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement