జియో ఎఫెక్ట్: 'వొడాఫోన్ రెడ్' అన్లిమిటెడ్ కాల్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు, ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్లతో ఇతర టెల్కోల్లో గుబులు మొదలైంది. దీంతో ప్రముఖ మొబైల్ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సంస్కరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వోడాఫోన్ రెడ్ ప్లాన్స్ మూడింటిలో కూడా దాదాపు అదే అఫర్లను అందిస్తోంది. ఈ ప్యాక్ లపైనా అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు అపరిమిత ఉచిత కాల్స్ రూ 16.999 ల రీచార్జ్ పై అందిస్తోంది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్లలో మార్పులు చేసి ఫ్రీ కాల్స్, అదనపు డాటాను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ లో ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్లాన్ 1
రూ 499లకు లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1 జీజీ డాటా ఉచితం. 2 జీబీ 4 జీ డాటా, 4 జీ మొబైల్స్ లో 3 జీబీ డాటా ఉచితం. దీంతోపాటు 100 ఎస్ఎంఎస్ లుకూడా ఉచితం.
ప్లాన్ 2
రూ. 699 ప్లాన్ లో లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ , 5జీబీ 4జీ , లేదా 2.5జీబీ డాటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం.
ప్లాన్ 3
రూ.399 ఎంపిక చేసినప్రాంతాల్లో అన్ లిమిటెడ్ కాలింగ్.. 1 జీబీ 4 జీ డాటా తోపాటు 100 ఎస్ఎంఎస్ లు అదనం.
కాగా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు, ఎంటర్‌ప్రైజ్ ఖాతాదారుల కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునే ప్రణాళికలో గతంలో వొడాఫోన్ రెడ్', ‘వొడాఫోన్ రెడ్‌ఫర్ బిజినెస్' పేర్లతో ఆల్ ఇన్ వన్ పథకాలను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీలో వినియోగదారులను నిలబెట్టుకునే క్రమంలో ఈ సరికొత్త పునరుద్ధరణను కంపెనీ చేపట్టింది.