Netflix Offer: Airtel Users Can Get Free Netflix Subscriptions With These Postpaid Plans - Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌..!

Published Thu, Mar 24 2022 9:19 PM | Last Updated on Fri, Mar 25 2022 12:58 PM

Airtel Users Can Get Free Netflix Subscriptions With These Postpaid Plans - Sakshi

పలు దిగ్గజ టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకుగాను బండిల్‌ రీచార్జ్‌ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్స్‌తో పలు ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. కాగా తాజాగా ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కేవలం పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలు..!
ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ సేవలను ఉచితంగా పలు బండిల్‌ ప్లాన్స్‌తో అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పోస్ట్‌ పెయిడ్‌ యూజర్ల కోసం ఫ్యామిలీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్స్‌తో ఆయా ఎయిర్‌టెల్‌ యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను పొందవచ్చునని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. రూ. 1199,  రూ. 1599 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇక రూ. 1599 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌తో పాటుగా, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను కూడా ఉచితంగా పొందవచ్చును. అంతేకాకుండా 500GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో వస్తుంది. ఇది అపరిమిత లోకల్, STD , రోమింగ్ కాల్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా,  అపరిమిత కాల్‌లు హ్యాండ్‌సెట్ రక్షణతో ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌ని కూడా అందిస్తుంది. కాగా రూ.999 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను సవరిస్తూ రూ. 1199గా ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టింది. ఈ సర్వీసులను పొందాలంటే ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో సబ్‌స్రైబ్‌ చేసుకోవాలి. 

చదవండి: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌,అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్! ఐపీఎల్‌ అభిమానులకు పండగే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement