
సాక్షి,ముంబై: ఎయిర్‌టెల్ రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సమీక్షించింది. జియో దెబ్బతో అనివార్యంగా ఎయిర్‌టెల్ కూడా ఇప్పుడు ఈ ప్లాన్‌లో కొన్నిమార్పులు చేసింది. రూ. 98 రీచార్జ్‌పై రోజువారీ పరిమితి లేకుండా 28 రోజుల వ్యవధిలో 5జీబీ (3జీ / 4జీ)డేటా ఉచితమని ప్రకటించింది. అంటే 28 రోజుల్లో ఎపుడైనా మొత్తం 5జీబీ డేటాను వాడుకనే సౌలభ్యాన్ని అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఆఫర్లు లేవు. అలాగే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది.
కాగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రూ. 98 ఈ హై స్పీడ్ డేటాను 28 రోజులు రోజువారీ టోపీ పరిమితి లేకుండా అందిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెలు తాజా మార్పులను వెల్లడించింది. కాగా రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కూడా ఇటీవల మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 1 జీబీ( 3జీ / 4జీ) డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం.