
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారం లాభాల బాట పట్టలాంటే కస్టమర్లను ఆకట్టుకోవడమే ప్రధాన మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సూత్రాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ టెలికాం కంపెనీలు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తక్కువ ధరలోనే బెస్ట్ ఆఫర్లు ప్రవేశపెట్టింది ఎయిర్‌టెల్.
సరికొత్త ఆఫర్లు
కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూ.519, రూ.779 ప్లాన్‌ని తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఇందులో రూ. 779 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ ఉండగా, రూ. 519 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ ఉంది. ఈ రెండు ప్లాన్‌లలో కస్టమర్లు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ(STD), రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5జీబీ 4G డేటా, రోజుకు 100 SMSలను పొందుతారు. అయితే.. ప్రస్తుతం టెలికాం కంపెనీలు 28, 56 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందిస్తుండగా ఈ ప్లాన్లు పూర్తి క్యాలెండర్ నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్ (FASTag)పై రూ.100 క్యాష్ బ్యాక్, ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
చదవండి: Bajaj CT 125X: బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment