
బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అదిరిపోయే న్యూయర్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్ ఛార్జీలను పెంచిన సమయంలో వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ డేటా ఇచ్చే రూ.599 ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ప్రతిరోజు 5జీబీ డేటాను అందిస్తుంది.
ఈ 5జీబీ డేటా అయిపోయిన తర్వాత వేగం 40 కెబిపిఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా పంపించవచ్చు. దీనితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను కూడా ఉచితంగా చూసేయవచ్చు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా అందిస్తోంది. అయితే, ఇవన్నీ ఫీచర్స్ ఎన్ని రోజుల కాలపరిమితితో వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ప్లాన్ 84ల రోజు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వల్ల ఇతర కంపెనీలకు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది.