క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్ | Jio Cricket plans at Rs 499 and Rs 777 launched | Sakshi
Sakshi News home page

క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్

Published Tue, Aug 25 2020 9:51 AM | Last Updated on Tue, Aug 25 2020 2:39 PM

Jio Cricket plans at Rs 499 and Rs 777 launched - Sakshi

సాక్షి, ముంబై:  రానున్న ఐపీఎల్ 2020 సందర్భంగా  క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. జియో క్రికెట్ ప్లాన్స్  పేరుతో , 499 , 777 రూపాయల  ప్యాక్ లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లలో 399  రూపాయల విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్  ఏడాదిపాటు ఉచితంగా  అందిస్తోంది.  తద్వారా డిస్నీ ప్లస్  హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మైజియో యాప్ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది.


జియో రూ. 499 క్రికెట్ ప్లాన్
రోజుకు1.5 జీబీ డేటా హై-స్పీడ్ డేటా క్రికెట్ సీజన్ మొత్తం కాలానికి  56 రోజులు పాటు అందిస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ చందా  ఏడాది  ఉచితం. అలాగే ఇందులో ఎలాంటి వాయిస్,  ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు.
 
జియో రూ. 777 క్రికెట్ ప్లాన్
ఈ ప్లాన్ కింద, 5 జీబీ అదనపు డేటాతో 1.5 జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా
అపరిమిత జియో  టూ జియో కాలింగ్  
ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 ఎఫ్‌యుపి నిమిషాలు 
రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌లు
ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement