
BSNL 197 Plan Details: ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్ ధరలను పెంచుతూ యూజర్లపై అధిక భారాన్ని మోపాయి. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఏ టెలికాం కంపెనీ ఆఫర్ చేయని ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తన యూజర్ల కోసం తీసుకొచ్చింది.
అతి తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ..!
పాత యూజర్ల కోసం, కొత్త యూజర్ల కోసం వారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్. తాజాగా అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీను అందించే ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేసింది. కేవలం రూ.197రీచార్జ్ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీను అందించనుంది.
అధిక వ్యాలిడిటీతో పాటుగా..!
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన రూ. 197 ప్లాన్‌తో ఎక్కువ రోజుల వ్యాలిడిటే కాకుండా రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు కూడా ఆఫర్ చేస్తుంది. కాగా ఈ ప్రయోజనాలు మాత్రం కేవలం 18 రోజులు మాత్రమే పొందే వీలు ఉంటుంది. సుదీర్ఘ వ్యాలిడిటీ అందించమే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 18 రోజుల తర్వాత కూడా ఎలాంటి టాప్అప్ వేయకపోయినా ఉచిత ఇన్‌కమింగ్ సౌకర్యాన్ని పొందే వీలు ఉంటుంది. దాంతో పాటుగా 40kbps వేగంతో ఇంటర్నెట్‌ను కూడా పొందవచ్చును.
చదవండి: హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment