సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి సరికొత్త వ్యూహాలతో దూసుకుపోయేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ప్రధాన ప్రత్యర్థులు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా పాత ప్లాన్లను సమీక్షిస్తోంది. తాజాగా రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్ లో భారీ మార్పులతో లాంచ్ చేసింది. ఇందులో అదనపు డేటాతో పాటు మరికొన్ని ప్రయోజనాలను అందించనుంది. ఈమేరకు టెలికాం టాక్ రిపోర్టు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది.
ప్లాన్ వ్యాలిడిలీ 26 రోజులు. గతంలో ఉన్న 1.5 జిబికి అదనంగా 0.5జీబీ డేటా అదనంగా లభించనుంది. తద్వారా రోజుకు 2జిబి డేటాను యూజర్లు అందుకుంటారు. ఈ డేటా పరిమితి మంచిన తర్వాత స్పీడే వేగం తగ్గుతుంది. దీంతోపాటు ఏరోస్ ఇండియా సబ్ స్క్రిప్షన్‌కూడా ఉచితంగా అందించనుంది.
కాగా ఈ ప్లాన్ ను గతేడాది మేలో సునామి ఆఫర్ కింద రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్‌లో 1.5జిబి డేటాను యూజర్లకు అందించేది.
Comments
Please login to add a commentAdd a comment