
దిగ్గజ టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను సుమారు 25 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పాటుగా ఆయా టెలికాం సంస్థలు యూజర్లకు అందిస్తోన్న ఓటీటీ సేవల బండిల్ ప్యాకేజ్ ధరలను కూడా పెంచాయి. కొన్ని సంస్థలు ఆయా ఓటీటీ ప్లాన్స్‌ను పూర్తిగా నిలిపివేశాయి. ఓటీటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయంలో దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీఐ) యూజర్లకు షాకిచ్చింది.
ఓటీటీ ప్లాన్స్ నిలిపివేత..!
పలు ఓటీటీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను వొడాఫోన్ ఐడియా నిలిపివేసింది.వీఐ ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 501, రూ. 601, రూ. 701 ఓటీటీ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు వీఐ బుధవారం డిసెంబర్ 29న ప్రకటించింది. ఈ ప్లాన్స్‌లో భాగంగా డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీ సేవలను ఏడాదిపాటు సబ్‌స్క్రిప్షన్ అందించేది.
కొత్త ప్లాన్స్ ఇవే..!
ఓటీటీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో భాగంగా కొత్త ప్లాన్స్‌ను వీఐ ప్రకటించింది. ఇకపై డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీ సేవలను పొందాలంటే యూజర్లు రూ. 901 లేదా రూ. 3,099 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. రూ. 901 రీఛార్జ్‌తో 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాను యూజర్లకు వీఐ అందిస్తోంది.అంతేకాకుండా యూజర్లు అదనంగా 48జీబీ డేటాను పొందవచ్చును. వీఐ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.3,099 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
చదవండి: జియో యూజర్లకు అలర్ట్.. 42 కోట్ల వినియోగదారులకు మెసేజ్!
Comments
Please login to add a commentAdd a comment