కొద్ది రోజుల క్రితం ప్రముఖ టెలికాం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ రేట్లను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు భారీగా ఉండడేమ కాకుండా, ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు కూడా చాలా వరకు తగ్గాయి. అందుకే యూజర్లు మాత్రం గతంలో వారికి అందించినట్లుగా వారికి సరిపడే ప్లాన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ టెలికాం సంస్థల ప్లాన్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.666కు అందిస్తున్నాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్‌లను 77 రోజుల పాటు వినియోగించుకుంటే, జియో మాత్రం అదే రూ.666 ప్లాన్‌ను 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఇస్తుంది. ఈ డేటా ప్యాక్ లో డేటా, కాలింగ్ ప్రయోజనాల్ని అందిస్తుంది. అయితే రెండు నెలలకు పైగా వాలిడిటీ ఉన్న ప్లాన్‌ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్‌లు ఉపయోగపడనున్నాయి.
గత వారం వొడాఫోన్ ఐడియా రూ.700 లోపు నాలుగు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధర రూ.155, రూ.239, రూ.666, రూ.699. ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
వొడాఫోన్ ఐడియా వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ జియో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, 1.5జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. 77 రోజుల పాటు వీఐ సినిమాలు, టీవీకి యాక్సెస్ చేసుకోవచ్చు. వీటితో పాటు బింగే ఆల్ నైట్ బెనిఫిట్స్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్ వంటి ఆఫర్‌లను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఇప్పుడు అదే విధమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 77 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అదనంగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24గంటల పాటు నిర్విరామంగా యాక్సెస్ చేయొచ్చు.సెవెన్ సర్కిల్, షా అకాడమీతో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ ను పొందవచ్చు.
జియో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో 1.5జీబీ రోజువారీ డేటాను అందించే రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ జియో యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.
వొడాఫోన్ ఐడియా వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ జియో రూ. 700 లోపు 56 రోజుల వ్యాలిడిటీ
అదే సమయంలో వొడా ఫోన్ ఐడియా రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్‌ను వినియోగించుకునే యూజర్లు 56రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇది అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ ఎం ఎస్‌లను పొందవచ్చు.
జియో 56రోజుల వ్యాలిడిటీతో రూ.533 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ తో పాటు జీయో యాప్‌లను వినియోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ 56 రోజుల వ్యాలిడిటీతో రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24గంటల పాటు నిర్విరామంగా యాక్సెస్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment