హెచ్సీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్ : విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శుక్రవారం పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. వీసీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించడం వల్ల సమస్య పరిష్కారం కాదని పరిపాలన భవనం సిబ్బంది స్పష్టం చేశారు.
విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడం వల్ల ల్యాబ్లో ఉపయోగించే అత్యంత విలువైన కెమికల్స్ వృథా అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు సహకరిస్తే పరిష్కారం దొరుకుతుందని సిబ్బంది స్పష్టం చేశారు.