'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం' | hcu-four-students-health-condition-unstable-says-doctors | Sakshi
Sakshi News home page

'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం'

Published Sat, Jan 23 2016 1:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం' - Sakshi

'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం'

హైదరాబాద్: హెచ్సీయూలో నిరవధిక దీక్ష చేపట్టిన విద్యార్థులను తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్ ను ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు.
 
రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా డిమాండ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారిందని వారు ఆరోపించారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో  ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు.  కాగా రోహిత్ కుటుంబానికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు హెచ్సీయూ ప్రొఫెసర్లు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement