HCU students
-
హెచ్‌సీయూ వీసీ హత్యకు కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) వైస్ ఛాన్సులర్ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం-చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హెచ్‌సీయూ విద్యార్థులు చందన్ మిశ్రా, పృధ్వీరాజ్ పోలీసులకు చిక్కారు. కాగా 2013లో రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఎంఏ చదువుతున్న చందన్ కుమార్ మిశ్రా కోల్‌కతా వాసి. ఇక అంకల పృధ్వీరాజ్ కృష్ణాజిల్లా కేసరపల్లికు చెందినవాడు. వీరిద్దరికీ హెచ్‌సీయూలో పరిచయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. వీరిని శనివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. మరోవైపు వీరిద్దర్ని వారం క్రితమే పోలీసులు పట్టుకున్నారని విరసం ఆరోపిస్తోంది. వారిద్దరినీ విడుదల చేయాలని విరసం ఇప్పటికే పోస్టర్లు విడుదల చేసింది. ఇక ఈ ఘటనపై హెచ్‌సీయూ వీసీ అప్పారావు స్పందిస్తూ...‘నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. నన్ను చంపడం కోసం ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదు. పోలీసులు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్‌సీయూ ప్రశాంతంగా ఉంది.’ అని అన్నారు. -
రాధిక మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకే..
• రూపన్వాల్ కమిషన్ నివేదికపై మండిపడ్డ విద్యార్థులు • ఆ రిపోర్టు నిరాధారం.. విద్యార్థుల అభిప్రాయాలు పరిశీలించలేదు • రోహిత్‌తోపాటు రస్టికేషన్‌కు గురైన విద్యార్థుల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సం బంధించి నియమించిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ రోహిత్ తల్లి రాధిక మనో నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు కులాన్ని ఉపయోగించుకుందని హెచ్‌సీయూ విద్యార్థులు ఆరోపించారు. రిజర్వేషన్ల కోసమే రాధిక కులాన్ని ఉపయోగించుకున్నారనడాన్ని వారు ఖండించారు. రూపన్వాల్ కమిషన్ రిపోర్టుని వ్యతిరేకిస్తూ శుక్రవారం హెచ్‌సీయూలో విద్యార్థులు ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక రిజర్వేషన్ల కోసమే కులాన్ని ఉపయోగించుకున్నారని కమిషన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో దళిత తల్లుల పక్షాన నిలిచి పోరాడుతున్న రాధికను మానసికంగా కుంగదీసేందుకే కమిషన్ ఇటువంటి రిపోర్టునిచ్చిందన్నారు. కమిషన్ రిపోర్టు నిరాధారమైనదని, అందులో ఎక్కడా విద్యార్థుల అభిప్రాయాలుగానీ, రోహిత్ మరణానికి కారణాలను కానీ పరిశీలించినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరిధిని మించి వ్యవహరించిందని, మొత్తంగా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి కాపాడేందుకు చేసిన కుట్రలో భాగమే ఈ నివేదిక అని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల రస్టికేషన్ని సైతం కమిషన్ సమర్థించడం నేరపూరిత వ్యాఖ్యానమని అభిప్రాయపడ్డారు. రోహిత్ దళితుడో కాదో తేల్చమని హెచ్ఆర్డీ శాఖ కమిషన్‌ను కోరలేదని, అటువంటప్పుడు రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేమిటో తమకు అర్థం కావడం లేదని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు వ్యాఖ్యానించారు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. రూపన్వాల్ కమిషన్ ముమ్మాటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రని రోహిత్‌తో పాటు రస్టికేట్ అయిన దొంత ప్రశాంత్, వేల్పుల సుంకన్న, విజయ్, శేషు పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌సీయూలో జరిగిన విద్యార్థుల సభలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను కాపాడేందుకు కమిషన్ పేరిట కుట్ర చేశారన్నారు. రోహిత్ మరణానంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ క్యాంపస్‌లో వివక్షని ఎత్తిచూపిందని, హెచ్‌సీయూలోని విద్యార్థి వ్యతిరేక పరిణామాలను, రస్టికేషన్‌ను తప్పుపట్టిందని గుర్తుచేశారు. అయితే విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులు అనుభవిస్తున్న వివక్షని, ఆత్మహత్యలకు కార ణాలను విస్మరించి రూపన్వాల్ కమిషన్ విద్యార్థి వ్యతిరేక రిపోర్టును ఇచ్చిందన్నారు. హాస్టల్స్ నుంచి వెలివేతను సమర్థించ డాన్ని బట్టే కమిషన్ గుట్టు బట్టబయలైందని ఆరోపించారు. బీజేపీ, ఏబీవీపీకి కొమ్ముగాస్తున్న వీసీ అప్పారావును, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, అప్పటి వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. -
హెచ్‌సీయూ విద్యార్థుల విడుదల
చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా వర్సిటీకి సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు మంగళవారం రాత్రి 9 గంటలకు బెయిలుపై విడుదలయ్యారు. వీరిలో ప్రొఫెసర్లు రత్నం, తథాగత్, ఏఎస్ఏ అధ్యక్షుడు ప్రశాంత్, జేఏసీ నాయకుడు వెంకటేశ్‌చౌహాన్, లింగస్వామి, అచ్యుతరావు, హరీష్‌లతో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మియాపూర్ కోర్టు న్యాయమూర్తి వరూధిని బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. వీరి విడుదల కోసం ఉదయం నుంచి జైలు బయట విద్యార్థులు, ప్రొఫెసర్ల నిరీక్షించారు. విడులైన అనంతరం జీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి ప్రదర్శనగా హెచ్సీయూకు వెళ్లారు. వారందరికీ హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు కాగడాలు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. ఏఎస్ఏ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ... చెరసాలలు, ఉరికొయ్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు. ప్రొఫెసర్ రత్నం మాట్లాడుతూ... వీసీ అప్పారావును తొలగించేవరకు తమ పోరాటం ఆగదన్నారు. -
అమానుషంగా వ్యవహరించారు...
ములాఖత్‌కు వెళ్లిన నేతలతో హెచ్‌సీయూ విద్యార్థుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు అమానుషంగా వ్యవహరించి అక్రమంగా అరెస్టు చేశారని చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం ములాఖత్ కోసం వెళ్లిన నేతలతో వాపోయారు. పోలీసులు పథకం ప్రకారమే తమను అరెస్టు చేశారని, ముందుస్తు వ్యూహం అమలు చేశారని పేర్కొన్నట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన నేతలు వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు, ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య విడివిడిగా జైలులో ఉన్న విద్యార్థులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, ప్రొఫెసర్ రత్నం, కృశాంక్, లింగస్వామి, అమృతరావు, దుంగ హరీష్‌లతో ములాఖత్ అయ్యారు. హెచ్‌సీయూ ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. తమను పోలీసులు పలు పోలీస్స్టేషన్లలో ఉంచి అమానుషంగా వ్యవహరించారని విద్యార్థులు చెప్పారు. పోలీసుల చర్యల కారణంగా తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురయ్యారని, కొందరు ఆస్పత్రి పాలయ్యారని జైలులో ఉన్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన మౌలానా ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థిని అరుణ తెలిపారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఖండన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసుల దాడిని, అరెస్టులను అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయంలో పోలీసుల మోహరింపుపై, జరిగిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాకను తిరస్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడం అన్యాయమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయవిచారణ లేకుండా ఎవరినీ శిక్షించే అధికారం లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సయ్యద్ ఆకార్ పటేల్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. -
ఢిల్లీకి చేరుకున్న హెచ్‌సీయూ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ మృతి ఘటనపై విద్యార్థులు ఈ నెల 23న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి హెచ్‌సీయూ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని బేతూల్ ప్రాంతాల్లో విద్యార్థులకు పలు ప్రజా సంఘాలు స్వాగతం పలికాయి. 23న ఆందోళన కార్యక్రమం, 24న ఇండియాగేట్ వద్ద నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు తెలిపారు. ఈనెల 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ విడుదల కోసం చేస్తున్న ఆందోళనల్లో కూడా తాము పాల్గొంటామని తెలిపారు. -
రోహిత్ చట్టాన్ని సాధిస్తాం
హైదరాబాద్: రోహిత్ వేముల ఆశయాల సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను ఛేదిస్తామని, రోహిత్ చట్టాన్ని సాధిస్తామని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం హెచ్‌సీయూ విద్యార్థుల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిందూ దేశంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినంగా శిక్షించే వరకు ఉద్యమం ఆగదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. రోహిత్ ఘటనపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జెఎన్యూలో కన్హయ్యపై దేశద్రోహ నేరం మోపారని మల్లెపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్ని అడ్డంకులెదురైనా రోహిత్ చట్టం వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ నాయకులు జోహెల్ అన్నారు. రోహిత్‌కు జరిగిన అన్యాయంపై యువకులు, విద్యార్థులు ఆగ్రహావేశాలతో ఉన్నారని కన్వీనర్ వెంకటేశ్ చౌహాన్ తెలిపారు. ఏబీవీపీ విద్యార్థులు శూలాలతో ప్రదర్శనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, కులవివక్షపై పోరాడుతున్న విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని ఓయూ జేఏసీ నాయకులు దుర్గం భాస్కర్ ఆరోపించారు. డీఎస్ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, జమాతే ముస్లిం నాయకులు షబ్బీర్, మాల సంక్షేమ సంఘం నాయకులు రాంప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాంబశివ, పిడిఎస్యు నాయకులు రాము, సత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. విచారణ తేదీలను మార్చాలని వినతి రోహిత్ ఘటనపై నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ తేదీని ఈ నెల 27కు మార్చాలని హెచ్‌సీయూ సామాజిక న్యాయపోరాట విద్యార్థి జేఏసీ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నందున తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు మున్న, ఫిరదౌస్ సోనీ, జుహైల్, సంజయ్, ధనుంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణను యుజీసీ ప్రాంతీయ కార్యాలయంలో కాకుండా హెచ్‌సీయూలో నిర్వహించాలని వారు కోరారు. హెచ్‌సియు బంద్‌కు పిలుపు జేఎన్‌యూ ఉపాధ్యాయులు, విద్యార్థుల పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో పాల్గొనాలని హెచ్‌సియు విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఫాసిస్టు దాడులను వ్యతిరేకిస్తూ జరిగే బంద్ లో విద్యార్థులంతా పాల్గొనాలని కోరారు. గురువారం ఉదయం 9 గంటలకు లైఫ్ సెన్సైస్ బిల్డింగ్ దగ్గర బంద్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. -
23న హెచ్‌సీయూ విద్యార్థుల చలో ఢిల్లీ
- 11 నుంచి తెలంగాణ, ఏపీల్లో బస్సు యాత్ర - కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమాలు హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థులు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే తొలుత పేర్కొన్నట్లుగా చలో ఢిల్లీని ఈ నెల 20కి బదులుగా 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం ప్రకటించారు. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ చౌహన్ చెప్పారు. దేశవ్యాప్తంగా కదిలి వచ్చే విద్యార్థులతో మూడు రోజుల పాటు ఆందోళనలు చేపడతామన్నారు. ఇక ఈనెల 11వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు ఉస్మానియా, కాకతీయ, మహత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, ఆంధ్రా, ఎస్వీ, నాగార్జున, పద్మావతి, జేఎన్టీయూ, ద్రావిడ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలతో పాటు ప్రధాన విద్యాసంస్థలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రిలే దీక్షలలో బిహార్ విద్యార్థులు రోహిత్ ఘటనకు సంఘీభావంగా హెచ్‌సీయూలో బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు, మధ్యప్రదేశ్ గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో జిక్రుల్లాఖాన్, విషాల్ కుమార్, జితేంద్ర కుమార్, కుమార్ సౌరభ్, ఆశుతోష్ పాండే, ఫైజుల్ ఇస్లాం, మృత్యుంజయ్ పాండే, దివాకర్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థులకు ఓయూ జేఏసీ మద్దతు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనల కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఓయూ జేఏసీ రెండు రోజుల పాటు నిరసన తెలపనుంది. ఆ కార్యక్రమ వివరాలను జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ నెల 25 న హెచ్‌సీయూ ముట్టడితో పాటు 26 న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం'
హైదరాబాద్: హెచ్‌సీయూలో నిరవధిక దీక్ష చేపట్టిన విద్యార్థులను తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్ ను ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు. రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా డిమాండ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారిందని వారు ఆరోపించారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు. కాగా రోహిత్ కుటుంబానికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు ప్రకటించారు. -
హెచ్‌సీయూలో నాలుగోరోజుకు చేరిన విద్యార్థుల దీక్ష
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కి న్యాయం జరగాలంటూ హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ హెచ్సీయూకు రానున్నారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు వారు సంఘీభావం తెలపనున్నారు. -
నివేదిక రాకుండానే ఎలా మాట్లాడారు?
-
'బీజేపీ, ఆరెస్సెస్‌కు ఇష్టం లేదు'
హైదరాబాద్ : దేశంలో దళితులు బాగుపడటం బీజేపీ, ఆరెస్సెస్‌కు ఇష్టం లేదని ప్రొ. కంచె. ఐలయ్య ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రొ. కంచె ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లో ఆయుధాలు ఏమైనా దొరికాయా ? అని నిలదీశారు. విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఓ కేంద్రమంత్రి ఎలా కేంద్రానికి లేఖ రాస్తారన్నారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్‌కు రాజకీయాలతో సంబంధం లేదని ఐలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో అగ్రకులాల ఆధిపత్యం నశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.విశ్వేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. -
మా సస్పెన్షన్‌ను రద్దు చేయండి
* హైకోర్టులో హెచ్‌సీయూ విద్యార్థుల పిటిషన్ * సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం సాక్షి, హైదరాబాద్: తమను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దొంత ప్రశాంత్‌తోపాటు పలువురు పీహెచ్డీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు వైస్‌చాన్స్‌లర్ ఆమోదంతో రిజిస్ట్రార్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట నిబంధనలకు సైతం విరుద్ధమని పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉంటూ తమ చదువును పూర్తిచేసే అవకాశం కల్పించాలని కోరారు. హాస్టళ్లతో పాటు పరిపాలనా భవనం, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో సంచరించేందుకు, విద్యార్థి సం ఘం ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతివ్వాలని కోరారు. జస్టిస్ సంజయ్‌కుమార్ వద్దకు..: ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుకు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం విజ్ఞప్తి చేశారు. అయితే హెచ్‌సీయూ వివాదంలో కేంద్ర బిందువైన విద్యార్థి సుశీల్‌కుమార్‌కు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్‌కుమార్ విచారిస్తున్నారు. దీంతో అదే అంశానికి సంబంధించిన ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ పిటిషన్‌తో కలిపి విచారించడం మేలని... అది వేరే న్యాయమూర్తి ముందు ఉన్నందున దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు సంబంధిత ఫైల్‌ను తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే ముందుకు తీసుకెళ్లగా... విద్యార్థుల వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్‌కుమార్‌కే కేటాయించారు. సుశీల్‌కుమార్ తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 25న విచారణకు రానుంది. ఈ లెక్కన దొంత ప్రశాంత్ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా అదేరోజున విచారించే అవకాశముంది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ప్రశాంత్ తదితరుల తరఫు న్యాయవాది బుధవారం న్యాయమూర్తిని కోరితే... ఆయన తీసుకునే నిర్ణయం ఆధారంగా కేసు విచారణ ఉంటుంది. బీజేపీ నేతలు తమను జాతి వ్యతిరేకులుగా అభివర్ణిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా వీసీపై ఒత్తిడి తెచ్చారని దొంత ప్రశాంత్ తదితరులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. హాస్టళ్ల నుంచి మాత్రమే పంపేశాం ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్ఏ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంపై సుశీల్‌కుమార్ ఫేస్బుక్లో అభ్యంతరకర సందేశం పోస్ట్ చేశారని... అదే వివాదానికి కారణమైందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ హైకోర్టుకు నివేదించారు. ఈవివాదంలో ఏఎస్‌ఏకు చెందిన ఐదు గురిని తొలుత వర్సిటీ నుంచి సస్పెండ్ చేశామ న్నారు. కానీ వారి భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్‌ను రద్దు చేశామని, హాస్టల్ నుంచి మాత్రమే పంపేశామని చెప్పారు. సుశీల్‌కు రక్షణ కల్పించాలంటూ అతని తల్లి విన య దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు చేశారు. -
ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం
♦ నేపాల్‌లోని ‘టెచో' గ్రామానికి హెచ్‌సీయూ విద్యార్థుల అండ ♦ తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు. ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్‌యూ పీహెచ్డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నివాసాల కోసం.. ‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్‌పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్‌లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్‌తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం. అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు. మళ్లీ వెళ్తాం.. ‘నేపాల్‌లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్‌లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్. ఫేస్బుక్ సాయం.. ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా 2013లో నేపాల్‌లోని లలిత్పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్‌వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్బుక్లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు.