
రోహిత్ జోడీకి టైటిల్
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఏకే రోహిత్ సత్తా చాటాడు. పల్లవి మోడల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు.
అండర్–18 బాలుర డబుల్స్ ఫైనల్లో రోహిత్–పి.కుమార్ ద్వయం 6–1, 6–7 (4/7), 10–5తో సీహెచ్ అర్జున్–కర్రా తరుణ్ జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. సింగిల్స్ విభాగంలో రోహిత్ 4–6, 3–6తో సీహెచ్ అర్జున్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సంస్కృతి దామెర చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సంస్కృతి 6–1, 6–4తో ఎస్. సంజనపై గెలుపొందింది.