బిగ్‌బాస్ ఇచ్చిన బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్‌లో రోహిత్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. హౌస్‌మేట్స్ కోసం రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్‌కు కనీసం ఫోన్ మాట్లాడేందుకు ఛాన్సే ఇవ్వలేదు. తన త్యాగానికి తగిన గుర్తింపు దక్కలేదని రోహిత్ ఎమోషనలయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో గెలిచి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కానీ వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకునే బాధ్యతను తిరిగి హౌస్‌మేట్స్ చేతిలో పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఆఖరి వరకు ఆగని పరుగు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఇందులో భాగంగా ఇతర పోటీదారుల పూలకుండీలను తీసుకుని చివరగా కంటెండర్స్ డోర్ జోన్‌లోకి వెళ్లిన పోటీదారు, వారి దగ్గర ఎవరి పూలకుండీ ఉందో ఆ సభ్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వకూడదో మిగతా ఇంటిసభ్యులు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, వాసంతి నిలబడగా.. నామినేషన్‌కు భయపడినవాళ్లు వీక్ అంటూ వాసంతిని ఏకిపారేసింది గీతూ. నా కెప్టెన్సీలో ఏం పీకలేనన్నారు. ఇప్పుడు కెప్టెన్ అయితే ఏంటో చూపిస్తానన్నాడు ఆది. ఇక శ్రీసత్య తనకు రెండో లేడీ కెప్టెన్ అవ్వాలని ఉందంటూ రోహిత్‌కు కాకుండా తనకు ఓటేయమని అడిగింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో సూర్య కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్ ఒకవేళ కెప్టెన్ అయినా అతడికి ఇమ్యూనిటీ దక్కదన్న కారణంతో ఇంటిసభ్యులు సూర్యకు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: హౌస్‌మేట్స్ కోసం రోహిత్ త్యాగం
పూనమ్ కౌర్‌కు పెళ్లయిందా?
Comments
Please login to add a commentAdd a comment